
మూవీ : జాకీ
నటీనటులు: యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణ, అమ్ము అభిరామి, మధుసూదన్ రావు
ఎడిటింగ్: ఎన్. బి శ్రీకాంత్
సంగీతం: శక్తి బాలాజీ
సినిమాటోగ్రఫీ: ఎన్. ఎస్ ఉత్తయ్ కుమార్
నిర్మాతలు: ప్రేమ కృష్ణదాస్
దర్శకత్వం: ప్రగభాల్
ఓటీటీ : అమోజాన్ ప్రైమ్
కథ:
మధురైలో రాముడు (యువన్ కృష్ణ) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నాడు. అతనికి ఒక అక్క, మేనకోడలు ఉంటారు. వారే అతని కుటుంబం. ఆటో నడుపుతున్న రాముడికి ‘మీను’ (అమ్ము అభిరాభి) పరిచయమవుతుంది. ఆ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అదే విలేజ్ కి పెద్దమనిషిగా చక్రవర్తి (మధు సూదన్ రావు) ఉంటాడు. ఆయన మేనల్లుడే కోబ్రా కార్తీక్ (రిధాన్ కృష్ణ). అతను ఎక్కువగా పొట్టేళ్ల పోటీలలో పాల్గొంటాడు. అయితే ఆ ఊర్లో పొట్టేళ్ల పోటీలో గెలిచినవారికి ‘జాకీ’ అంటే ఒక మెడల్ ఇస్తారు. ఆ మెడల్ కారణంగా వాళ్లకి ఊళ్లో ఎంతో గౌరవం లభిస్తుంది.
ఆ మెడల్ ఏడాది నుంచి కార్తీక్ దగ్గరే ఉంటుంది. అలాంటి కార్తీక పొట్టేలుతో, రాముడి పొట్టేలు ‘కాళీ’ తలపడుతుంది. ఆ పోటీలో అనుకోకుండా కాళీ గెలుస్తుంది. దాంతో రాముడికి జాకీ మెడల్ వస్తుంది. తను చేజారిపోయిన మెడల్, రాముడికి దక్కడం కార్తీక్ తట్టుకోలేకపోతాడు. అందుకోసం మరోసారి తనతో పోటీకి తలపడేలా రాముడిని రెచ్చగొడతాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? రాముడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
సినిమా మొత్తం పొట్టేళ్ళ మధ్య పందెం సాగుతుంది. ఇందులో లవ్, రిలేషన్స్, ఫ్రెంధ్ షిప్ ఉన్నప్పటికి పొట్టేళ్ళ మధ్య పోటీనే హైలైట్ చేశారు మేకర్స్. దానివల్ల క్యారెక్టర్ల కంటే కూడా పొట్టేళ్ళే ముఖ్యపాత్రలుగా కనిపిస్తారు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా లేకపోవడం.. సినిమా ‘మొదల్లో హీరో ఫ్యామిలీతో హ్యాపీగా గడిపే సీన్లు చూపించినా ఆ తర్వాత అవి ఎక్కడా కనపడవు..ఎంత సేపు పొట్టేళ్ళ పోటీ.. అందులో’.. గెలవాలి.. లేదంటే వ్యూహం పన్నాలని ఎక్కువగా ఉంది. అది సినిమాకి పెద్ద మైనస్ గా ఉంది.
అటు హీరో, ఇటు విలన్ నటన కాస్త వీక్ గానే అనిపిస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా పలకలేదు. క్లైమాక్స్ పర్వాలేదు. కొన్ని సీన్లు కొత్తగా ఉన్నాయి. అయితే వాటి కోసం సినిమా చూడాలా అంటే లేదనే చెప్పాలి. కొత్తదనం లేని పాయింట్ తో వచ్చిన ఈ జాకీకి ఎవరు పెద్దగా కనెక్ట్ కాలేరు.
పొట్టేళ్ల ఫైట్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువైపోవడం, మిగిలిన ఎమోషన్స్ శాతం తగ్గడం వల్ల ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. ఎన్. ఎస్ ఉత్తయ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. శక్తి బాలాజీ బిజిఎం అండ్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటినటుల పనితీరు: రాముడుగా యువన్ కృష్ణ, కోబ్రా కార్తీక్ గా రిధాన్ కృష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక మిగిలిన వారు తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా: జస్ట్ ఓకే.
రేటింగ్: 1.5 / 5
✍️. దాసరి మల్లేశ్

