[ad_1]
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి హైకోర్టు సమన్లు అందజేయడానికి అధికారులు ఆమె నివాసానికి వచ్చినట్లు సమాచారం. ఈ కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారమని ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు జారీ చేసిన నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు. ఇదే కేసులో కవితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురికి కూడా సీబీఐ నుంచి నోటీసులు అందాయి. వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డి ఉన్నారు.
[ad_2]