[ad_1]
కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతాపం ప్రకటించారు. సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరమని చంద్రబాబు తెలిపారు. మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరని లోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
మరొవైపు మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీమంత్రి, రాజకీయ కురువృద్ధులు, మా బంధువు కావూరి సాంబశివరావు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రగతి కోసం ఎనలేని కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. కావూరి సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి ఉందని లోకేష్ పేర్కొన్నారు.
[ad_2]