డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి,తుమ్మలదళారులకు చెక్ పెడుతూ అర్హులకు అండగా నిలిచినప్రభుత్వంవెలుగుమట్లభూనిర్వాసితుల్లోఅర్హులకుఇళ్లపట్టాలుఇందిరమ్మ ఇండ్లు311 మందికి భూదాన్
*భూమిలోభూమిపట్టాతోపాటుఇందిరమ్మ ఇండ్లు101 మంది అర్హులకువారిసొంతూర్లలో ఇందిరమ్మ ఇండ్లు
యుద్ధ ప్రాతిపదికన మౌళిక వసతులకల్పన పనులుదళారుల నుంచి బాధితులకు డబ్బు వసూలు చేసి అందిస్తాం *వెలుగుమట్లభూనిర్వాసితుల్లో అర్హులకు పట్టాలు,ఇందిరమ్మఇళ్లమంజూరుపత్రాలనుఅందజేసినడిప్యూటీసీఎం,మంత్రులు
--------------------------
ఖమ్మం, మార్చి -11:
--------------------------
డిసెంబర్ 9 న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా వెలుగుమట్ల భూదాన్ భూముల లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశం జరుపుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపడుతుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తెలిపారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావులు వెలుగుమట్ల భూ నిర్వాసితుల్లో అర్హులకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
*డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ* ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇండ్లు ఉండాలని నిర్ణయం తీసుకుని తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. హౌసింగ్ శాఖ ద్వారా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను 22 వేల 500 కోట్లతో మంజూరు చేశామన్నారు.
ప్రతి వారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తుందని తెలిపారు. పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్న ప్రభుత్వంపై కొంత మంది కావాలని బురద చల్లుతున్నారని తెలిపారు. పేదల నిస్సహాయత ఆసరాగా తీసుకొని సమాంతరమైన వ్యవస్థ ఏర్పాటు చేసి త్రాగునీరు, బడి, విద్యుత్ సదుపాయం వంటి సౌకర్యాలు లేకుండా పేదలు భయం లోనే బ్రతికేలా విష వలయం పన్నారని డిప్యూటీ సీఎం అన్నారు.
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం నేడు పట్టాలు అందిస్తుందని అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై కొంతమంది కావాలని దురుద్దేశంతో సామాజిక మాధ్యమాలలో విష ప్రచారం చేస్తున్నారని, ఎవరు ఏం ప్రచారం చేసిన పేదలకు న్యాయం జరగాలనీ అంతిమ లక్ష్యాన్ని సాధించే దిశగా తాము పని చేస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ దురుద్దేశాలు, ప్రభుత్వాన్ని విమర్శించారు అనే పట్టింపులు లేకుండా అర్హులైన 412 మంది నిరుపేద కుటుంబా లకు ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లను నేడు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పేదలను అనేకమంది అనేకసార్లు వచ్చి బెదిరించే వారని, భయాందోళనల మధ్య గతంలో వారు గడిపారని, ఆ పరిస్థితికి నేడు ప్రజా ప్రభుత్వం స్వస్తి పలికిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన పట్టాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం భూమి పూజ కార్యక్రమం గురువారం జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 9 న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇతర మౌళిక వసతులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించు కోవాలన్నారు.పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ను పది సంవత్సరాల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట మోసం చేసిన ప్రతిపక్షాలు ప్రశ్నించడం హాస్యాస్పదమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత తమకు ఉందా అని ఆత్మవిమర్శ చేసుకోవాలని డిప్యూటీ సీఎం హితవు పలికారు. పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేసిన ప్రతి ఒక్కరికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, ప్రతి ఒక్క రూపాయి నిందితుల నుంచి వసూలు చేసి బాధితులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రపంచ స్థాయి పోటీలకు సన్నద్ధమయ్యే విధంగా మన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తుందని తెలిపారు. వెలుగు మట్ల భూదాన్ భూములలో పేదలకు పంచగా మిగిలిన భూమిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, స్కూల్స్ పక్క భవనాలకు ఆ స్థలం ఉపయోగిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.వెలుగుమట్ల లబ్ధిదారులు నేటి నుంచి నిర్భయంగా ఉండాలని, మోడల్ కాలనీగా తయారు చేసి అందించే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు.రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* మార్చి 1, 2026 నాడు ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలైన లబ్దిదారులకు సీఎం, కేబినెట్ సహచరుల సహకారంతో 311 మంది ఇంటి స్థలం లేని వారికి ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం, సొంత ఊరిలో స్థలం ఉన్న మరో 101 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను ఎటువంటి భేషజాలు లేకుండా ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.ఫిబ్రవరి24నవెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలు జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి మొసలి కన్నీరు కార్చారని మంత్రి ఎద్దేవా చేశారు. 2023 జూలై నెలలో ఎన్నికల కంటే ముందు వెలుగు మట్ల ప్రాంతంలో కూల్చివేతలకు గత ప్రభుత్వం పాల్పడింది వాస్తవం కాదా, 9 సంవత్సరాలుగా పేదలు ఎటువంటి వసతులు లేకుండా నివసిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఎటువంటి పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు.పదిసంవత్సరాలురాష్ట్రాన్నిపరిపాలించే సమయంలో పేదలకు పట్టాలు ఇవ్వాలనే బుద్ధి జ్ఞానం ఎందుకు రాలేదని మంత్రి విమర్శించారు. గత పాలకులకు విశాల హృదయం లేదని, తమ ప్రభుత్వం ప్రజల కష్టాలను చూసిచలించి నేడు పట్టాలు పంపిణీ చేస్తున్నామనిఅన్నారు. ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షానికి లేదని స్పష్టం చేశారు.ప్రతిపక్ష నాయకులు మాప్రభుత్వంవస్తుందని పగటికలలు కంటున్నారని, అనేక ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పటికీ మార్పు చెందకుండా కక్ష పూరిత మనస్తత్వంతోప్రవర్తిస్తున్నారనిఅన్నారు.10సంవత్సరాల పాటు పేదలను పట్టించు కోలేదని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఇస్తుందని అన్నారు.త్రాగునీరు, రోడ్లు, ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్, విద్యుత్ సరఫరా వంటి అనేక మౌళిక వసతుల వసతుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. గత 8 సంవత్సరాలుగా పేదలు ఇబ్బందులు పడినమాటవాస్తవమేనని, ఆ సమస్యలకు నేడుపరిష్కారంలభిస్తుందని, అర్హులైన బాధితులు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటె వారికి కూడా తమ ప్రభుత్వం తప్పని సరిగా ఇండ్లుమంజూరు చేస్తుందని అన్నారు.పేదలను మోసం చేసి దళారులు వసూలు చేసిన డబ్బు ఒక్క రూపాయి కూడా వదలకుండా పూర్తి స్థాయిలో వసూలు చేసి బాధితులకుఅందించాలని మంత్రిపోలీస్,కమీషనర్నుఆదేశించారు.వ్యవసాయ,మార్కెటింగ్,సహకార,చేనేత,జౌళీశాఖలమంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* పేదలను కొంత మంది ముఠాగా ఏర్పడిమోసం చేస్తేగతపాలకులుపట్టించుకోలేదన్నారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట ఇచ్చిన పత్రాలు బోగస్ అని, సిసిఎల్ఏ ఆ భూములు స్వాధీనం చేసుకోవాలనిఆదేశాలు జారీ చేసిందన్నారు.
లాఠీ ఛార్జ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేసిదగాకోరులనుతరిమివేశామనిమంత్రితెలిపారు.నిరుపేదలకు వెలుగు మట్ల భూదాన్ భూములలో భూ పట్టాలు పంపిణీ చేస్తున్నామని, పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ మోడల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులు, విద్యుత్, మంచి నీరు, రోడ్లు, డ్రైయిన్ వంటి మౌళిక వసతులకల్పనపనులు పూర్తి చేస్తామన్నారు.
డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగాముఖ్యమంత్రిని తీసుకువచ్చి భూ దాన్ భూములలో నూతనంగా చేపట్టే 311 మంది లబ్ధిదారుల కాలనీ ప్రారంభించేలా చర్యలుతీసుకుంటామనిఅన్నారు.నిరుపేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో కొంత ఇబ్బంది పడటం జరిగిందని ఆయన తెలిపారు.అనధికారికంగానిరుపేదలునివసించే దుస్థితి రాకుండా అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తామని అన్నారు. 311 మంది లబ్ధిదారులే కాకుండా మరో 101 మంది నిరుపేదలకు వారి సొంత ఊరిలో ఉన్న స్థలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసామని అన్నారు.
చివరి లబ్ధిదారుడి వరకు ఇండ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వెలుగుమట్ల కాలనీ అద్భుతంగా తీర్చి దిద్దుతామని, పేదల దగ్గర డబ్బులు వసూలు చేసిన దళారుల వివరాలు పోలీసులకు అందించాలని, వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ* వెలుగు మట్ల భూదాన్ భూములకుసంబంధించి పెద్ద భూ మాఫియా నడుస్తుందని, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. 311 మంది నిరుపేదలకు పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకుప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిరుపేదలు నివసించే కాలనీలో ఇండ్లతో పాటు పార్క్, రోడ్డు, స్కూలు, విద్యుత్తు, త్రాగు నీరు వంటి మౌళిక సదుపాయాల పనులు కూడా వేగవంతంగా పూర్తి అయ్యేలాచూడాలన్నారు. ప్రత్యేక కేసు క్రింద పరిగణించి ఇంటి నిర్మాణానికి మంజూరు చేసే నిధులు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్అనుదీప్ దురిశెట్టిమాట్లాడుతూ* వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితుల బాధితులలోపారదర్శకంగా చేపట్టిన సర్వే ద్వారా అర్హులుగా గుర్తించిన 311 మంది లబ్ధిదారులకు నేడు డిప్యూటీసీఎం,మంత్రుల చేతుల మీదుగా వెలుగు మట్లలో ఇంటి స్థలాలతోపాటుఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీచేస్తున్నామన్నారు.వెలుగుమట్లభూదాన్ భూములలో లేఔట్ వేసి 311 ఫ్లాట్ లు చేశామని,లబ్ధిదారులకు పారదర్శకంగా సాఫ్ట్ వేర్,తోమానవప్రమేయంలేకుండార్యాండమైజేషన్,ద్వారాప్లాట్లుకేటాయించామనితెలిపారు. 1953 రికార్డుల ప్రకారం 147, 148, 149 సర్వే నెంబర్ లో 31 ఎకరాల 7 గుంటల భూమినీ రాజా రామారావు భూదాన్ ఉద్యమంలో దానంచేశారనితెలిపారు.
*ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ* 2014లో కత్తి రామ చంద్రయ్య, ముత్తయ్య, కల్లూరి కృష్ణ, బాబురావు, ఇతరులు ఇలా 21 మంది సభ్యులు కలిసి ఒక సంఘం తయారు చేసి భూదాన్ భూములను కబ్జా చేసి పేదల దగ్గర నుంచి 30 వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసి భూమి పట్టాలు ఇస్తామని ఆక్రమణలు చేయించా రని, వీరిపైఇప్పటివరకు 26 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేయడంజరిగిందన్నారు. కల్లూరు కృష్ణ ఇంటిలో చేపట్టిన తనిఖీ లలో మూడు కోట్ల రూపాయల వరకు పేదల నుంచి వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయని, వీరి ఆస్తులు వివరాలు సేకరించి వాటి ద్వారా పేదల నుంచి వసూలు చేసిన డబ్బు రికవరీ కు ప్రయత్నం చేస్తామని సిపి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వెలుగుమట్లలబ్ధిదారులు మాట్లాడుతూ* గత 8 సంవత్సరాలుగా భూదాన్ భూములలో ఉంటున్నప్పటికీ రోడ్లు, కరెంట్, త్రాగునీరు వంటి మౌళిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డామని, నేడు అన్ని వసతులతో కూడిన లేఔట్ లో తమకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, నిరుపేదలైన తమను అర్హులుగా ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
దళారులు కొంతమంది పార్టీ ఫండ్, విద్యుత్ పోల్స్, భూమి రెగ్యులరైజ్ కోసమని తమ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రజలను మోసం చేస్తున్న వారికి శిక్ష పడే విధంగా చూడాలనిమంత్రులను లబ్ధిదారులు కోరారు.
ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లురాయలనాగేశ్వరరావు,నాయుడుసత్యనారాయణ, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ,ఖమ్మంమునిసిపల్కార్పొరేషన్,కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, ప్రజాప్రతినిధులు, సంబంధితఅధికారులు,లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.



