
సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడంలో టైటిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే టైటిల్ విషయంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కంటెంట్ కి తగ్గ టైటిల్ ని ఎంచుకుంటూనే, అందరి దృష్టిని ఆకర్షించేలా చూసుకుంటారు. తాజాగా ఓ టైటిల్ అలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారింది.
‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న ఈటీవీ విన్ నుంచి మరో సినిమా రాబోతుంది. వంశీ నందిపాటి నిర్మాణం ఈ చిత్రం ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకులు.
ఈ సినిమాకి ‘ఇంకా ఏం అనుకోలేదు'(ఇంకా ఎం అనుకోలేదు) అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేయడం విశేషం. తాజాగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టుగానే ఆ వీడియో కూడా మీమ్ కంటెంట్ తో డిఫరెంట్ గా ఉంది.
‘ఇంకా ఏం అనుకోలేదు’ ఈ ఏడాది సెప్టెంబర్ 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ చిత్రం సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, రెహాన్ సినిమాటోగ్రాఫర్‌గా నటించారు.
ఇది కూడా చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పెన్నుమ్ పోరాట్టమ్’

