Home Latest News మావోయిస్టు ఉద్యమంపై ఆశన్న సంచలన వ్యాఖ్యలు | ఆశన్న| వాసుదేవరావు| మావోయిస్టు పార్టీ| నక్సలైట్ల లొంగుబాటు| తెలంగాణ| బట్టుపల్లి| దండకారణ్య| మాజీ మావోయిస్టు నాయకుడు| తెలంగాణ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి| సివి ఆనంద్| హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ – Jananethram News

మావోయిస్టు ఉద్యమంపై ఆశన్న సంచలన వ్యాఖ్యలు | ఆశన్న| వాసుదేవరావు| మావోయిస్టు పార్టీ| నక్సలైట్ల లొంగుబాటు| తెలంగాణ| బట్టుపల్లి| దండకారణ్య| మాజీ మావోయిస్టు నాయకుడు| తెలంగాణ పోలీసులు| డీజీపీ శివధర్ రెడ్డి| సివి ఆనంద్| హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


మావోయిస్టు లోంగుబాట్లపై ఆశన్న వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆశన్న తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లిలో మాజీ మావోయిస్టులు, అమరుల కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తాము ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమ ఉన్నవారితో పాటు ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టుల ప్రాణాలను కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడే, అంటే దాదాపు పదేళ్ల క్రితమే లొంగుబాటు నిర్ణయం తీసుకుంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుకునేవారని అభిప్రాయపడ్డారు.

దండకారణ్యంలో సుమారు 30 ఏళ్ల పాటు ఆదివాసీల హక్కుల కోసం, నిర్బంధంలో ప్రశ్నించే హక్కును నిలబెట్టేందుకు పనిచేశామని ఆశన్న గుర్తు చేసుకున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాలకు వారధిగా ఉన్న భట్టుపల్లితో తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని, ఈ ప్రాంతంతో తనకు విడదీయని అనుబంధం ఉందని తెలిపారు.

ఈ సమావేశంలో ఆశన్నతో పాటు పవనానందరెడ్డి అలియాస్ శ్యాందాదా, కందగట్ల యాదగిరి అలియాస్ రాజ్‌మన్, ఆయన భార్య పద్మ, వనిత, వెంకటేశ్, చంప, సంతోష్, అర్జున్, వికాస్ అయ్యారు. మావోయిస్టు మాజీ అమరుల కుటుంబాలను కలవడం, వారితో చర్చలు జరపడం, పోలీసు నిఘా అధికారులు నిశితంగా గమనించినట్లు సమాచారం.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird