Home Latest News సృష్టి సరోగసీ కేసులో ఈడీ దూకుడు | అక్రమ సరోగసీ రాకెట్| క్రియేషన్ సరోగసీ కేసు| ED| PMLA చట్టం| డా. నమ్రత| గోపాలపురం పోలీస్ స్టేషన్| సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Jananethram News

సృష్టి సరోగసీ కేసులో ఈడీ దూకుడు | అక్రమ సరోగసీ రాకెట్| క్రియేషన్ సరోగసీ కేసు| ED| PMLA చట్టం| డా. నమ్రత| గోపాలపురం పోలీస్ స్టేషన్| సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


హైదరాబాద్‌లో వెలుగు చూసిన భారీ అక్రమ సరోగసీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ పచ్చిపల్లి అట్లూరి నమ్రత కు చెందిన భారీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులపై చర్యలు తీసుకుంటూ దాదాపు రూ.29.76 కోట్ల విలువైన 50 స్థిరాస్తులను పీఎంఎల్‌ఏ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

అయితే ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ అటాచ్ చేసిన ఆస్తుల్లో భూములు, ఫ్లాట్లు, అలాగే ఆసుపత్రి భవ నం కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుల పేర్లపై నమోదు చేయబడి నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈడి దర్యాప్తు ప్రకారం, “యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్” పేరుతో డాక్టర్ నమ్రత ఒక విస్తృత స్థాయి అక్రమ సరోగసీ నెట్‌వర్క్‌ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. సంతానం లేని దంపతులు సరోగసీ ద్వారా బిడ్డను అందజేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు.

ఈ వ్యవహారంపై హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో మోసం, కుట్ర, అక్రమ సరోగసీ, శిశు అక్రమ రవాణా వంటి పలు కేసులు నమోదు కావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో బయటపడిన వివరాలు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయి. సరోగసీ ప్రక్రియ నిజమై నదిగా కనిపించేలా దంప తుల గ్యామిట్స్ సేకరించినప్పటికి, నిజానికి పుట్టిన శిశువులు పేద మరియు బలహీన కుటుంబాల నుంచి వచ్చిన ఈడీ గుర్తించింది. ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్ల ద్వారా పేద గర్భిణీలను గుర్తించి డబ్బులతో ప్రలోభపెట్టి పుట్టిన తమ పిల్లలను అప్పగిం చేందుకు ఒప్పించేవారని దర్యాప్తులో తేలింది.

ఈ ఆడ శిశువుకు సుమారుగా రూ.3.5 లక్షలు, మగ శిశువుకు రూ.4.5 లక్షల వరకు చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా, మున్సిపల్ అధికారులకు పంపే జనన ధృవపత్రాల్లో అసలు తల్లి దండ్రుల వివరాలను తొలగించి, పిల్లలను పొందిన దంపతుల పేర్లను తల్లిదం డ్రులుగా నమోదు చేసేలా నకిలీ పత్రాలు తయారు చేసినట్లు ఈడీ గుర్తించింది.

దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. డాక్టర్ నమ్రత 2014 నుంచే ఈ అక్రమ సరోగసీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదవడం, మెడికల్ లైసెన్స్ రద్దు కావ డం జరిగినప్పటికీ కూడా ఈ వ్యవహారం కొనసాగడం వల్ల నట్లు వెల్లడైంది. సికింద్రాబాద్‌లో ఉన్న ఆసుపత్రి లైసెన్స్ రద్దు అయిన తర్వాత విశాఖపట్నంలోని ఆసుపత్రిలో డెలివరీలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. సంతానం లేని దంపతుల నుంచి చెక్కులు, నగదు రూపంలో భారీ మొత్తాలు వసూలు చేసి నట్లు బ్యాంక్ లావాదేవీల విశ్లేషణలో బయటపడింది. అందులో కొంత సహాయకులు, సబ్‌ఏజెంట్లకు కమీషన్‌గా చెల్లించారు, మరో శిశువుల అసలు తల్లిదండ్రులకు అధికారులు ఇచ్చినట్లు గుర్తించారు.

ఈ అక్రమ లావాదేవీల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిం చినట్లు ఈడీ అనుమానిస్తోంది.పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ అధికారులు డాక్టర్ నమ్రతను 2026 ఫిబ్రవరి 12న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె న్యాయపర మైన కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాల వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అక్రమ సరోగసీ రాకెట్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అధికా రులు మరిన్ని ఆధారాలను సేకరిస్తూ, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇతర వ్యక్తుల పాత్రను కూడా గుర్తించారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird