Home సినిమా పవన్ కళ్యాణ్ పై సుస్మిత వ్యాఖ్యలు వైరల్.. భయపెట్టాడనేది నిజం – Swen Daily

పవన్ కళ్యాణ్ పై సుస్మిత వ్యాఖ్యలు వైరల్.. భయపెట్టాడనేది నిజం – Swen Daily

by
0 comments
పవన్ కళ్యాణ్ పై సుస్మిత వ్యాఖ్యలు వైరల్.. భయపెట్టాడనేది నిజం


-మన శంకర వరప్రసాద్ గారు తో జోష్ లో ఉన్న సుస్మిత ‘
-మెగా డాటర్ నుంచి మెగా ప్రొడ్యూసర్
-పవన్ కళ్యాణ్ గురించి స్పీచ్

సుస్మిత కొణిదెల(Sushmita Konidela).. ఇప్పుడు ఓన్లీ సుస్మిత కొణిదెల కాదు మెగా ప్రొడ్యూసర్ . మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)డాటర్ గా ఎంట్రీ ఇచ్చి, తండ్రి టోటల్ సినీ కెరీర్ కే ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కలెక్షన్స్ పరంగా కూడా మొట్టమొదటి తెలుగు ప్రాంతీయ సినిమా. దీన్నిబట్టి చిరంజీవి నే సుస్మిత కి గౌరవం ఇవ్వాల్సిన సినీ పరిస్థితి. మరి ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది. అభిమానుల ఆనందం అయితే అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ తో కూడా సినిమాలు చేయాలనే డిమాండ్ పురుడు పోసుకొని చాలా రోజులే అవుతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్) గురించి సుస్మిత మాట్లాడిన మాటలు వాళ్ళ జోష్ ని మరింత తీసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.

సుస్మిత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటం నాతో పాటు మా ఇంట్లో ఉండే పిల్లలందరితో బాబాయ్ చాలా సరదాగా గడిపే వారు. నా వరకు ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదు, ఒక బ్రదర్. సినిమాలంటే ఆసక్తి కలిగేలా చేసింది కూడా బాబాయ్ నే. నాతో పాటు రామ్‌చ‌రణ్‌(రామ్ చరణ్)మిగతా పిల్లలందర్నీ కూర్చోబెట్టి హర్రర్ కథలు చెప్పేవారు. నాకు హర్రర్ కథలంటే చాలా ఇష్టం ఉండటంతో శ్రద్ధగా వినేదాన్ని. కానీ మిగిలిన పిల్లలు భయపడి మధ్యలోనే వెళ్లిపోయేవారు. బాబాయ్ దగ్గర ది గాడ్ ఫాదర్, స్టార్ వార్స్ లాంటి సినిమాల క్యాసెట్స్ ఉండేవి. అసలు హాలీవుడ్ సినిమాలని పరిచయం చేసింది బాబాయినే. సంగీతం కూడా ఆయనే మాకు వినిపించేవారు. అలాకొత్త ప్రపంచాన్ని చూపించారు.

కూడా చదవండి: ప్రేమికులు పిచ్చి పిచ్చిగా పాడుకుంటున్న పాట.. 316 మిలియన్ల వ్యూస్

బాబాయ్ ఏ డ్రెస్ వేసుకున్నా వెంటనే ట్రెండ్ అవుతుంది. ఆయన స్టైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆధ్యాత్మికత, తాత్వికత పాళ్ళు చాలా ఎక్కువ. . ఆ విషయాలు మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని సుస్మిత చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు అభిమానులని అలరిస్తున్నాయి. పవన్ తో సినిమా చెయ్యాలంటే డిమాండ్ ఇంకా పెరిగింది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird