
హైదరాబాద్‌లో కత్తిపోట్ల కలకలం. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలవరాన్ని రేకెత్తించింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లర్ నం. 1482 సమీపం లో ఉన్న వారాహి కన్సల్టెన్సీ ప్రారంభ పనిచే స్తున్న మేనేజర్ శశికిరణ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శశికిరణ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు, అక్కడే ఉన్న ట్రైనర్ లయ అనే యువతి కూడా గాయపడింది.
గాయపడిన వెంటనే ఆసుపత్రికి తరలించిన ఇద్దరికి, చికిత్స పొందుతూ శశికిరణ్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు గాయపడిన లయ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.సమాచారం అందుకున్న వెంటనే బంజా రాహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిం చారు. దాడి చేసిన వ్యక్తి ఎవరు? దాడికి కారణాలు ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను కూడా గుర్తించారు.ఈ ఘటనతో మధురానగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

C.E.O
Cell – 9866017966

