
- సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’
- సెన్సార్ టాక్ ఎలా ఉంది?
- ‘గబ్బర్ సింగ్’లా మరో బ్లాక్ బస్టర్ అవుతుందా?
- తెలుగునాట ‘ధురంధర్-2’కి షాక్ ఇస్తుందా?
‘బిగ్ఓజీ’తో కెరీర్‌గెస్ట్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్), ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తా భగత్ సింగ్)తో మరోసారి తన బాక్సాఫీస్ పవర్ చూపించాలని అనుకుంటున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైం 2 గంటల 34 నిమిషాలు లాక్ చేసినట్లు సమాచారం.
‘ఉస్తాద్ భగత్ సింగ్’కి సెన్సార్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా దర్శకుడు హరీష్ శంకర్ మలిచాడట. మాస్ తో పాటు ఆడియన్స్ కూడా ఫ్యామిలీ అయ్యేలా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారట.
ఈ సినిమా మొదట మార్చి 26న విడుదల చేయాలి అనుకున్నారు. లాంగ్ వీకెండ్, హాలిడేస్ ని దృష్టిలో పెట్టుకొని మార్చి 19 కి ప్రీ పోన్ చేశారు. అదే రోజు ‘ధురంధర్-2’ పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతున్నప్పటికీ.. పవర్ స్టార్ స్టార్ డమ్, కంటెంట్ మీద నమ్మకంతో అదే రోజు ఉస్తాద్ కూడా బరిలోకి దిగుతుండటం విశేషం.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. తాజాగా థర్డ్ సింగిల్ ‘కాలరే ఎత్తరా’ ప్రోమోను విడుదల చేసింది. ఫుల్ సాంగ్ మార్చి 12 విడుదల. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో పాటు, భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


