
భారత క్రికెట్ చరిత్రలో నవశకం మొదలైందా? యంగ్ టీమ్ ఇండియా ఇప్పుడు అజేయ జట్టుగా చరిత్రలో నిలబడిపోతుందా? సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి దిగ్గజాలు దాదాపు ఒకే సమయంలో రిటైర్ అయినప్పుడు.. ఇక టీమ్ ఇండియా పరిస్థితి ఏమిటి? మ్యాచ్ లు గెలవడం అటుంచి కనీసం పోటీ ఇవ్వగలదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ నివృత్తి చేస్తూ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ వచ్చారు.
అయితే సచిన్ కొంత రిటైర్ అయిన తరువాత.. కోహ్లీ, ధోనీ వంటి వారు పుంజుకుని జట్టును గాడిలో పెట్టేందుకు సమయం పట్టింది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పొట్టి క్రికెట్ కు అంటే టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ ఇండియాకు మేమున్నామంటూ బోలెడంత మంది యువక్రికెటర్లు రెడీ అయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించి 20 నెలలు కూడా గడవకముందే.. అదే పొట్టి ఫార్మాట్ అంటే టి20 వరల్డ్ కప్ ను టీమ్ ఇండియా ముద్దాడింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర యుంగ్ ప్లేయర్లదే.
రో’హిట్’ ఛేజింగ్ కింగ్ కోహ్లీ లేని టీ20 జట్టు ఈ ఫార్మాట్‌లో రాణించగలదా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. పెద్ద సంఖ్యలో యంగ్ టాలెంట్ అందుబాటులోకి వచ్చింది. అలా టి20 వరల్డ్ కప్ 2026 విజయంలో అత్యంత కీలకంగా మారిన ఆటగాళ్లు ఎవరని చూస్తే.. మొదటిగా గుర్తుకు వచ్చే పేరు సంజూ శాంసన్.. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టులో చోటు కోల్పోయిన సంజూ శాంసన్ రింకూ సింగ్ లేని సమయంలో ఛాన్స్‌ను రెండు చేతులతో అందుకుంది. అత్యంత కీలకమైన చివరి మూడు మ్యాచ్ లలోనూ అద్భుతంగా రాణించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
ఆ తరువాత చెప్పుకోవలసిన ప్లేయర్ ఇషాన్ కిషన్.. దాదాపు రెండేళ్లకు పైగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోక.. దేశవాళీ క్రికెట్ ఆడి టన్నుల కొద్దీ పరుగులు సాధించిన ఇషాన్ కిషన్ టి20 వరల్డ్ కప్ జట్టులో బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నాడు. అంతే కాదు దాదాది దేశమైన పాకిస్థాన్ తో మ్యాచ్ లో అదరగొట్టాడు. ఆ తరువాత కూడా వేగంగా స్కోర్ చేయడంలో తన మార్క్ చూపించి జట్టులో అత్యంత కీలక సభ్యుడయ్యాడు. ఇక ఈ తరువాత చెప్పుకోవాలంటే తిలక్ వర్మ.. హైదరాబాదీ అయిన తిలక్ వర్మ వరల్డ్ కప్ టోర్నీ ఆసాంతం తన విలువ ఏమిటన్నది చాటి చెప్పే ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. తాను కేవలం ప్లేయర్ ను మాత్రమే కాననీ, ఇంపార్టెంట్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మర్ ననీ నిరూపించుకున్నాడు. ఆ తరువాత అభిషేక్ శర్మ… 22 ఏళ్ల ఈ కాశ్మీరీ యువకుడు వరల్డ్ కప్ టోర్నీలో అనుకున్నంతగా రాణించకపోయినా, కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. టోర్నీలోనే అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో అలరించాడు.
ఇక బౌలింగ్ వస్తే.. డెడ్లీ బూమ్రా ఉండనే ఉన్నాడు. అతనికి పూర్తి సహకారం అందించడం మరో పేస్ బౌలర్ కోం అన్వేషణ సాగించాల్సిన అవసరాన్ని వరల్డ్ కప్ టోర్నీ ఎత్తి చూపింది. హర్షదీప్, సిరాజ్ లు ఉన్నా.. మరో నాణ్యమైన పేసర్ అవసరం జట్టుకు ఉంది. ఇక విరాట్, రోహిత్ లు ఒకే సారి పొట్టి ఫార్మెట్ నుంచి రిటైర్ అయినా ఆ లోటు ఇసుమంతైనా కనిపించకుండా టీమ్ ఇండియా అజేయంగా రూపుదిద్దుకుందంటే.. గతంలో రాహుల్ ద్రావిడ్, ఇప్పుడు వీవీఎస్ లక్ష్హణ్ లు యువక్రికెటర్లకు శిక్షణ ఇస్తున్నారని చెప్పక తప్పదు. జట్టు చీఫ్ కోచ్ వరల్డ్ కప్ విక్టరీ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఇదే గురించి చెప్పాడు.

C.E.O
Cell – 9866017966

