
కడప జిల్లా కొండాపురం మండలంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సమీపంలోని చిత్రావతి వంతెన నెయ్యితో వెళ్తున్న ఒక ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. వంతెన వద్ద ట్యాంకర్ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో, అందులోని నెయ్యి భారీగా రోడ్డుపైకి, పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ప్రవహించింది. ట్యాంకర్ బోల్తా పడి నెయ్యి నేలపాలవుతోందన్న వార్త దావానలంలా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది .
విషయం తెలిసిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. చేతికి దొరికిన బిందెలు, బకెట్లు, చెంబులు, బాటిళ్లతో నెయ్యిని పట్టుకోవడానికి పోటీ పడ్డారు. రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని తోడుకోవడానికి అబాలగోపాలం ఎగబడటంతో అక్కడ సందడి. ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది, జనం నెయ్యిని సేకరించడంలోనే నిమగ్నమయ్యారు. ప్రమాదంలో డ్రైవర్‌కు జరిగిన గాయాల వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లా కొండాపురం మండలం అనంతపురం సమీపంలోని నెయ్యి ట్యాంకర్ బోల్తా
నెయ్యి కోసం బిందెలతో ఎగబడ్డ జనం
ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు pic.twitter.com/UEsPNC8W1T
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మార్చి 9, 2026

C.E.O
Cell – 9866017966

