[ad_1]
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్ చేశారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని అభినందించారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
ప్రజాభవన్‌లో నిర్వహించిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్‌లో సీఎం కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్ ఈ-కామర్స్ వేదిక ద్వారా విక్రయించేలా ఆ సంస్థతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన గుర్తించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే, వారిని పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దారు. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చుతున్నట్లు సీఎం అన్నారు. డీజిల్‌లను 2026 డిసెంబర్‌లోపు జిల్లాలకు తరలిస్తామని. హైదరాబాద్‌లో వంద శాతం ఈవీ బస్సులను తెస్తున్నాం. డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు.
నగరంలో ఏసీ ఈవీ బస్సులు తెస్తాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమెన్ జర్నలిస్టులతో కలిసి ఈ సంస్థ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. మహిళలకు సరైన గుర్తింపు ఈ ప్రభుత్వం చూపుతోంది. పోలీస్ సహా అవకాశం ఉన్న ప్రతి మహిళ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ అన్నారు
[ad_2]