
- బడ్జెట్ 4 కోట్లు.. కలెక్షన్స్ 40 కోట్లు
- పెద్ద హిట్ గా నిలిచిన చిన్న సినిమా ‘విత్ లవ్’
- తొలిప్రేమను గుర్తుచేస్తూ ఓటీలోనూ సంచలనం
రొమాంటిక్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఈ చిన్న ఏడాది సినిమాగా విడుదలైన తమిళ్, పెద్ద విజయాన్ని సాధించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘విత్ లవ్'(ప్రేమతో). కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ, వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న అభిషన్ జీవించి, ‘విత్ లవ్’తో హీరోగా మారాడు. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. మధన్ దర్శకత్వం వహించగా, సౌందర్య రజినీకాంత్ ఈ నిర్మించడం విశేషం. ప్రేమ, స్కూల్ మెమోరీస్, ఫస్ట్ క్రాష్‌ల నేపథ్యంతో సాగే ఈ రొమాంటిక్ డ్రామా.. ఫిబ్రవరి 6న థియేటర్లలో అడుగుపెట్టింది.
కథ ఏంటంటే..
పెళ్లిపై ఆసక్తి లేని సత్య( అభిషన్ జీవింత్), తన సోదరి కారణంగా అనుకోకుండా పెళ్లి చూపుల కోసం మోనిషా (అనస్వర రాజన్)ను కలుస్తాడు. అలా కలిసిన తర్వాత వాళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదువుకుంటున్నారని.. సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు. మాటల్లో స్కూల్ లవ్ స్టోరీలు షేర్ చేసుకుంటారు. స్కూల్ టైంలో తమ ప్రేమని వ్యక్తపరచలే.. తమ ఫస్ట్ క్రాష్ లను ఇప్పుడు కలవాలి అనుకుంటారు. పాత జ్ఞాపకాలను వెలికితీస్తూ మొదలైన వీరి ప్రయాణం ఎలా సాగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి: విత్ లవ్ మూవీ రివ్యూ
తొలిప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే. ముఖ్యంగా స్కూల్ రోజుల్లో క్రష్ పై ఇష్టాన్ని మనసులోనే దాచుకొని, మాటల రూపంలో బయటపెట్టనివారు ఎందరో ఉంటారు. మనసులోని మాటను చెప్పలేకపోయామని జీవితాంతం గుర్తు చేసుకొని బాధపడే కంటే, ఏదొక సమయంలో మనసులోని మాటను చెప్పడం మంచిది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘విత్ లవ్’. పెళ్లి చూపులతో మొదలై, స్కూల్ లైఫ్ ను గుర్తుచేస్తూ.. క్యూట్ లవ్ స్టోరీలతో, అందమైన జ్ఞాపకాలతో సరదాగా నడిచింది. ‘గుర్తుకొస్తున్నాయి’ అనేలా సాగిన ఈ ప్రయాణం.. ప్రతి ఒక్కరికీ వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తే సందేహం లేదు. అందుకే థియేటర్లలో అంతటి విజయాన్ని.
ఓటీటీలోనూ ‘విత్ లవ్’ సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మార్చి 6 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన వారు.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలిసిన కథే అయినా.. దానిని బ్యూటిఫుల్ గా, ఎంటర్టైనింగ్ చెప్పిన తీరు కట్టిపడేసిందని అంటున్నారు. ప్రస్తుత రెస్పాన్స్ చూస్తుంటే.. ఓటీలోనూ ‘విత్ లవ్’ రికార్డులు సృష్టించేలా ఉంది.

C.E.O
Cell – 9866017966


