Home Latest News రిల్స్ చేసిన దివ్వెల మాధురిపై చర్యలకు సిద్దమైన టీటీడీ | రిల్లు చేసిన మాధురిపై చర్యలకు సిద్ధమైన టీడీడీ| దివ్వెల మాధురి| బిగ్ బాస్ ఫేమ్ తనూజ| TTD| MLC దువ్వాడ శ్రీనివాస్| తిరుమల| యూట్యూబర్ గీతు రాయల్| టీడీడీ చైర్మన్ బ్ర నాయుడు| సీఎం చంద్రబాబు – Jananethram News

రిల్స్ చేసిన దివ్వెల మాధురిపై చర్యలకు సిద్దమైన టీటీడీ | రిల్లు చేసిన మాధురిపై చర్యలకు సిద్ధమైన టీడీడీ| దివ్వెల మాధురి| బిగ్ బాస్ ఫేమ్ తనూజ| TTD| MLC దువ్వాడ శ్రీనివాస్| తిరుమల| యూట్యూబర్ గీతు రాయల్| టీడీడీ చైర్మన్ బ్ర నాయుడు| సీఎం చంద్రబాబు – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియనేస్తం దివ్వెల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామిలపై చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. తిరుమలలో ఈ తరహా వేడుకలు పూర్తిగా నిషేధమని టీటీడీ ఈ సందర్భంగా. ఈ పుట్టిన రోజు వేడుకలను చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అభ్యంతరం ఉంది.

టీటీడీ ఫిర్యాదుపై విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమలకు కేక్ తీసుకు వచ్చి.. కట్ చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని విజిలెన్స్‌కు ఫిర్యాదులో టీటీడీ స్పష్టం చేసింది. గతంలోనూ తిరుమలలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ రీల్స్ చేశారు. కేసు విజిలెన్స్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆ సమయంలో టీటీడీ హెచ్చరించింది. ఆ తర్వాత ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారిపై టీటీడీ చర్యలు కూడా తీసుకున్న విషయం విధితమే. ఇటీవల యూట్యూబర్ గీతూ రాయల్ కూడా తిరుమలలో రీల్స్ చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దివ్వెల మాధురి, తనూజ పుట్టస్వామి జన్మదిన వేడుకలపైనా భక్తులు మండిపడుతున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird