[ad_1]
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అద్భుత నటనతో అలరించారు. సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం, శుక్రవారం సాయంత్రం విజయవాడ పట్టణం పటమటలోని ఆంత్రలాక్స్ హాల్లో ప్రజాప్రతినిధుల కోసం ఆంధ్రప్రదేశ్ “శాసన వ్యవస్థ” ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆటవిడుపు"ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు – 2026 కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో ఈ ప్రదర్శన ఇచ్చారు.
సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యకామాలను ప్రదర్శించారు. కట్టబొమ్మన విశిష్ట ఆహారం, గంభీరమైన వాచకం, రాజసంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో జీవించేశారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది.ఈ ప్రదర్శనను వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ పాత్రను వేనోళ్ల కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. "దేశభక్తికి నిలువెత్తు రూపం వీరపాండ్య కట్టబొమ్మన అని, పాంచాలకురిచ్చి యుద్ధంలో ఆయన చూపిన సాహసం చిరస్మరణీయమని" కొనియాడారు. అటువంటి మహనీయుడి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ నటనా శైలి, సంభాషణల చాతుర్యం, పుణ్యభూమి నాదేశం నమోనమామి పాటలో ప్రభుత్వ ప్రధాన జీవో ఆంజనేయులు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, సునీల్ కుమార్ తదితరులు సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రదర్శించిన తీరు సభికులను మంత్రముగ్ధులను చేశారు.
[ad_2]