
ముంబై బాంఖేడీ స్టేడియంలో గురువారం (మార్చి 5) జరిగిన ఇంగ్లండ్- ఇండియా రెండో సెమీస్ మ్యాచ్‌లో రికార్డులు మోత మోగాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను టీమ్ ఇండియా కేవలం విజయంతో మాత్రమే సరిపెట్టలేదు. టి20 ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది టీమ్ ఇండియా. సెమీస్ లేదా ఫైనల్స్ లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు ఏ జట్టు కూడా.. ఇంత వరకూ నాకౌట్ మ్యాచ్‌లో 250 పరుగుల మైలు రాయి దాటలేదు. అలాగే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండాయా, ఇప్పుడు కలిసి 499 పరుగులు చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ పూర్తి స్థాయి రన్- ఫెస్ట్ గా చరిత్రలో నిలిచిపోయింది.
సంజూ శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 89 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచాడు. టీ 20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డును సమం చేశాడు. 2016లో విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పై 89 నాటౌట్ రికార్డును టచ్ చేశాడు సంజూశాంసన్. ఇక ఈ దశలో భారత్ మొత్తం 19 సిక్సర్లు బాదింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల మ్యాచ్ ఇదే. మ్యాచ్ మొత్తంగా రెండు జట్లు కాలిసి 34 సిక్సర్లు కొట్టడం విశేషం.
ఈ గెలుపుతో భారత్ నాలుగో సారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. వరుసగా రెండో సారి ఫైనల్స్ చేరిన మూడవ జట్టుగా నిలిచింది భారత్. గతంలో పాక్, తర్వాత శ్రీలంక ఇలా వరుసగా మూడో సారిఫైనల్స్ కు చేరాయి.

C.E.O
Cell – 9866017966

