
కడప నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కడవ ప్రగతి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి,అమె భర్త టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని గురువారం(మార్చి 5) కలిసిన మాధవీరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కడప అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
నియోజకవర్గ పరిధిలోని రోడ్ల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులకు సీఎం హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాధవి తెలిపారు.

C.E.O
Cell – 9866017966

