[ad_1]
మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎన్నడూ లేనంతగా మంగళకరంగా కళకళలాడాయి. ఇటీవల మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం జరిగితే స్థానిక ఎమ్మెల్యేగా లోకేష్ తన సతీమని బ్రాహ్మణితో కలసి వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలను సంప్రదాయ బద్ధంగా అందచేశారు. ఈ దృశ్యం అచ్చం తిరుమల బ్రహ్మోత్సవాలకు మల్లె వార్తలకు ఎక్కింది. ఇన్నాళ్ల పాటు ఇక్కడ జరిగే ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే హాజరైనా, గతంలో అదేమంత గొప్పగా అనిపించేది కాదు. అదే ఇక్కడ ఎమ్మెల్యేగా లోకేష్ గెలవడంతో పాటు, ఆయన మంత్రి కూడా కావడంతో ఆ వైభవం, వైభోగం వేరే లెవెల్ అనిపించింది.
ఇవన్నీ ఇలా ఉంచితే, స్వామివారి కళ్యాణోత్సవానికి లోకేష్ తన సతీమణితో రావడం వల్ల ఒక సందేశాన్ని పంపారు. ఇటీవల జగన్ చేసిన యజ్ఞ యాగాలలో ఆయన సతీమణి భారతీ రెడ్డి లేకుండానే పాల్గొంటారు, అదే మంత్రి నారా లోకేష్ తన సతీమణితో సహా హాజరుకావతో సంప్రదాయ విలువలకు మరింత గుర్తింపు తెచ్చారు. అంతే కాదు ఇందులో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సందర్భంగా బ్రహ్మణి మంగళగిరి చేనేత చీర ధరించి రావడం. ఇటీవల లోకేష్ మంగళగిరి చేనేత వస్త్రాలను ఎంతో గుర్తింపు వచ్చేలా చేస్తున్నారు. ఆ గుర్తింపును తన భార్య బ్రహ్మణి నుంచే మొదలు పెట్టారు. దీనితో ఇక్కడి చేనేత వస్త్రాలకు ఒక బ్రాండింగ్ ఏర్పడుతోంది.
ఏది ఏమైన ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేష్ ని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడాన్ని అదృష్టంగా గుర్తించారు. అచ్చం తిరుమల శ్రీవారికి ముఖ్య మంత్రి పట్టు వస్త్రాలను ఎలా సమర్పిస్తారో, మంగళగిరి స్వామివారి కళ్యాణోత్సవం కూడా అలా రాజవైభవంతో సాగడం ఇక్కడి ప్రజలకు కన్నుల పండువగా మారింది.
[ad_2]