
ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని, మాజీ సీఎం జగన్ శాలరీ తీసుకోవడం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. మీడియాతో చిట్ చాట్లో సభాపతి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకీ హాజరుకాకుండా కేవలం బయట ఉంటూ జీతభత్యాలు తీసుకోవడం అనైతికమని స్పీకర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం రోజు వస్తే హాజరుకావాలనే నిబంధన ఎక్కడిది? ఆరోజు వచ్చినా అటెండెన్స్గా పరిగణించారని ఆయన అన్నారు.
నిబంధనల ప్రకారం వరుసగా 65 రోజుల పాటు సభకు అనుమతి లేకుండా గైర్హాజరైతే సభ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం కనీసం 10 శాతం సీట్లు (18 మంది ఎమ్మెల్యేలు) ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుందని, కేవలం 1 సీట్లు ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడం సాధ్యం కాదని అయ్యన్న పాత్రుడు మరోసారి తేల్చిచెప్పారు. మాజీ సీఎంగా దక్కాల్సిన అన్ని మర్యాదలు జగన్కు లభిస్తున్నాయి.

C.E.O
Cell – 9866017966

