
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. హోలీ పాల్గుణ పౌర్ణమి నుండి ఐదు రోజులపాటు జాతరకు వరంగల్ పూర్వపు జిల్లా నుండి వేలాది మంది భక్తులు వచ్చి వారి కోసం చెల్లించారు. తమ రైతులు మొదటి పంట నుండి వచ్చిన పంటను స్వామివారికి సమర్పించేందుకు తీరొక్కరూపంలో ప్రభ బండ్లు అలంకరించి ఆ బండ్ల లో కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. అది కాస్త రైతులు కట్టే ప్రభ బండ్లు రోజులు మారుతున్నా కొద్దీ రాజకీయ ప్రభ బండ్లు రూపాంతరం చెందుతూ…వచ్చాయి.
ఈ ప్రాంత రాజకీయ నాయకులు తమ బలాలను నిరూపించుకోవడానికి గ్రామాలలోని ప్రజలు తమ పార్టీ కార్యకర్తలతో తీరొక్క రూపాలలో ప్రభ బండ్లను తయారు చేసి డప్పు వాయిద్యాలు, కోలాటాలు, డిజిఏ సౌండ్స్‌తో డ్యాన్సులు చేస్తూ…ఒక్కరిపై ఒక్కరు నినాదాలు చేసుకుంటూ జతకు బయలుదేరడం జరుగుతుంది. కొన్ని సందర్బాలలో ఒకరిపై ఒకరు దాడులు చేయడంతో గొడవలు జరగి గాయాలు పాలుకావడం పరిపాటి. అదే ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన ప్రభ బండ్లు ఈరోజు ఉదయం దుగ్గొండి మండలం గిన్నిబావి ప్రధాన రహదారిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో పాటు బీజేపీ పార్టీలు పోటాపోటీగా వారి ప్రభ బండ్లను ప్రదర్శించారు.

C.E.O
Cell – 9866017966

