[ad_1]
-షాకింగ్ న్యూస్ వెల్లడి చేసిన మైత్రి
-ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి
-మార్చి నెల ఏం జరగబోతుంది
ప్రెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్)అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. కోట్లు ఇచ్చిన ఆ ఆనందాన్ని కొనలేం. దీనితో మార్చి నెల పవన్, పవన్ ఫ్యాన్స్ మంత్ గా మారే అవకాశం ఉంది. అందుకు వేదికగా నిలిచాడు ఉస్తాద్ భగత్. మరి ఆ ఆనందకర వార్త ఏంటో చూసేద్దాం.
ఉస్తాద్ భగత్ సింగ్(ఉస్తాద్ భగత్ సింగ్)ఈ నెల 26న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కానీ పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. ఏంటి నిజమేనా అని అనుకుంటున్నారా! అవును నిజమే.. అనుకున్న డేట్ కంటే ముందే మార్చి 19 న వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనుంది. ఈ మేరకు తాజాగా ఉస్తాద్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్స్, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ వరకు వచ్చి మళ్ళీ వాయిదా పడి కొంచం వెనక్కి జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. పవన్ ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఒక ఉదాహరణ. ఇలాంటి టైంలో ఉస్తాద్ ఇంకొంచం ముందుకు జరగడం అంటే అభిమానుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్(హరీష్ శంకర్)కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ భారీ బజ్ సృష్టించాయి. దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్'సాంగ్స్ అయితే చార్ట్బస్టర్లుగా నిలిచాయి.
also read: ప్రముఖ హీరోయిన్ కి అత్యాచార బెదిరింపులు.. ధురంధర్ గుర్తుంది కదా
సిల్వర్ స్క్రీన్ కూడా భారీ ఆశలతో ఉస్తాద్ లో శ్రీలీల(Sreeleela),రాశి ఖన్నా(Raashii Khanna)హీరోయిన్స్ కాగా భారీ కాస్టింగ్ నే స్క్రీన్ పై మెరవనుంది. రీసెంట్ గా సంగీతం నేపథ్య బాధ్యతలని థమన్ కి అప్పగించారు. దేవిశ్రీ ప్రసాద్(Devi Sriprasad)బిజీగా ఉండటమే అందుకు కారణం.
[ad_2]