
విడాకుల విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కేవలం వాట్సప్ చాటింగ్‌ల ఆధారంగా విడాకులు చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఒక జంట విడాకుల కేసును విచారించిన న్యాయస్థానం, డిజిటల్ సంభాషణల ఆధారంగా చేసిన క్రూరత్వం ఆరోపణలను ప్రామాణికంగా తీసుకోలేమని గుర్తించింది. భార్యాభర్తల మధ్య జరిగే చాటింగ్‌లను విడాకులకు ఏకైక ఆధారంగా పరిగణించాలని ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు సమర్పించడానికి బలమైన సాక్ష్యాధారాలు అవసరమని కోర్టు.
భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి గతంలో నాసిక్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన వాదనకు బలం చేకూర్చేందుకు భార్యతో జరిగిన వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సమర్పించాడు. ఆ చాటింగ్‌లో కాపురాన్ని నాసిక్ నుంచి పుణేకు మార్చాలని భార్య ఒత్తిడి తెచ్చినట్టు, అత్తమామలు మరియు వదినలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. భర్త సమర్పించిన వాట్సాప్ సందేశాలను ఆధారాలుగా పరిగణించిన నాసిక్ ఫ్యామిలీ కోర్టు, భర్త విడాకులు పొందేందుకు అర్హుడని తేల్చింది. వాట్సాప్ చాటింగ్ ఆధారంగా భార్య భర్తపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడం, భావోద్వేగపూరితంగా బ్లాక్‌మెయిల్ చేసినట్టు కోర్టు అభిప్రాయపడింది.

C.E.O
Cell – 9866017966

