[ad_1]
తెలంగాణ పోలీసులకు మావోయిస్టు అగ్రనేతలు టచ్‌లోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా పార్టీకి దీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గణపతి తరపున తెలంగాణ పోలీసులకు సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. భద్రతా సంస్థలతో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, సురక్షిత లొంగుబాటు కోసం నిబంధనలు, హామీలపై చర్చలు సాగుతున్నాయన్న ప్రచారం.
అయితే ఈ విషయంపై అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల మావోయిస్టు నేత దేవ్‌జీ లొంగిపోయిన ఘటనలో గణపతి ఆచూకీపై కీలక సమాచారం లభించిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దేవ్‌జీ సమర్పణ తర్వాత మావో యిస్టు అగ్రనేతల కదలికల పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గణపతి ఆరోగ్య, వయసు, అలాగే మావోయిస్టు కార్యకలాపాల బలహీనత నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు ఆసక్తి చూపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల సమన్వయంతో పరిస్థితిని గమనిస్తున్నట్లు సమాచారం.గణపతి లొంగుబాటు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు లేదా ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువరిస్తే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు నిజమైతే, తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఇది కీలక మలుపు కావచ్చని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ రోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి , ఐజీ సుమతి కూడా ఉన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్ల ప్రక్రియ వేగవంతం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవూజీ తో సహా పలువురు కీలక నేతల లొంగుబాట్లపై చర్చించినట్లు సమాచారం. లొంగు తర్వాత వారికి కల్పించాల్సిన భద్రత, పునరావాసం, కేసుల పరిశీలన తదితర వివరాలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రితో వివరణాత్మకంగా చర్చించినట్లు తెలిపారు.
దేవూజీతో జరిగిన సమావేశంలో మావోయిస్టులు ఉంచిన డిమాండ్లు, శాంతి చర్చలకు ప్రతిపాదనలు, అభివృద్ధి హామీలు వంటి అంశాలు కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడిస్తున్నారు.ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న “మావోయిస్టు భారత్రహిత” కాన్ఫరెన్స్‌కు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరిగింది.
దేశంలో మావోయిస్టు ప్రభావంతో అమలు చేస్తున్న చర్యలు, రాష్ట్రాల సమన్వయం,కేంద్ర-రాష్ట్రాల మధ్య వ్యూహాత్మక సహకా రం వంటి వాటిని సమ గ్రంగా సమీక్షించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాంతి, భద్రత, అభివృద్ధి అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రంతో కలిసి సమగ్ర వ్యూహంతో మావోయిస్టు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
[ad_2]