
-పోస్ట్ లో ఏముంది
-ఎవర్ని టార్గెట్ చేసారు
-అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది
గాడ్ క్రియేట్ చేసిన వాటిలో ‘కళ’ కూడా ఒకటి. వీరి కళకి మరో రూపం సినిమా. అలాంటి సినిమా సుదీర్ఘ కాలం నుంచి యావత్తు విశ్వాన్ని అలరిస్తూ వస్తుంది. ఈ విషయంలో కులం, మతం, ప్రాంతం, దేశం అనే బేధాలు ఉండవు. కేవలం కళ మాత్రమే సినిమాలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ విషయం అందరికి తెలుసు. కానీ రుక్మిణి వసంత్, (రుక్మిణి వసంత్),ఆషికా రంగనాధ్,(ashika ranganath),సప్తమి గౌడ(Sapthami Gowda)వలన కళ గురించి మరోసారి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. పూర్తి డీటైల్స్ చూద్దాం.
రీసెంట్ గా ఈ ముగ్గురు ఇనిస్టా వేదికగా కీలకమైన పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో మేము ‘కళ’ కోసం ఇక్కడ ఉన్నాం. హీరోయిన్ హోదాలో పబ్లిక్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఫోటోలు, వీడియోలను అనుచిత కోణాల్లో చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు. అనవసరమైన జూమ్ లతో మా పని కంటే శరీరం బాగాలకే ఎక్కువ విలువనిస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది ప్రవర్తన మమల్ని అగౌరవపరిచేలా ఉంది. ఇక ఇలాంటి చర్యలను సహించం. ఈ విషయంలో నటిమణులందరం ఏక తాటిపై నిలబడతామని ముగ్గురు ఒకే రీతిలో ఇనిస్టా వేదికగా పోస్ట్ చేసారు. అభిమానులు కూడా ఆ ముగ్గురు మాటలని సపోర్ట్ చేస్తున్నారు.
కూడా చదవండి: టాక్సిక్: టాక్సిక్ రిలీజ్ వాయిదా.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ
ఆ ముగ్గురి అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే రుక్మిణి వసంత్ ప్రెజంట్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేస్తుంది. మేకర్స్ ఏరి కోరి రుక్మిణిని ఎంపిక చేసుకున్నారు. ఆషికా రంగనాధ్ ఏమో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో చేస్తుంది. సప్తమి గౌడ నుంచి కొత్త చిత్రం ప్రకటన రాకపోయినా గత వారం రిలీజైన ‘రైజింగ్ ఆఫ్ అశోక’ లో కనపడి మెప్పించింది. ఆ కన్నడ భామలనే ముగ్గురు తెలుసుకున్నారు.

C.E.O
Cell – 9866017966

