Home Latest News రంగుల హోలీకి ‘మత్తు’ రంగు…. ఆరుగురు అరెస్టు | రంగుల హోలీ| హైదరాబాద్| మత్తెక్కించే రంగు| చింతామణి చందర్ సింగ్| సోహైల్ సింగ్| బేగంబజార్| సాగర్ శర్మ| అజయ్ శర్మ| భరత్ రాజ్| నందన్ యాదవ్| మహేష్| నేర వార్తలు| తెలంగాణ రాష్ట్ర పోలీస్| డీజీపీ జితేందర్ రెడ్డి| సీపీ సజ్జనార్ – Jananethram News

రంగుల హోలీకి ‘మత్తు’ రంగు…. ఆరుగురు అరెస్టు | రంగుల హోలీ| హైదరాబాద్| మత్తెక్కించే రంగు| చింతామణి చందర్ సింగ్| సోహైల్ సింగ్| బేగంబజార్| సాగర్ శర్మ| అజయ్ శర్మ| భరత్ రాజ్| నందన్ యాదవ్| మహేష్| నేర వార్తలు| తెలంగాణ రాష్ట్ర పోలీస్| డీజీపీ జితేందర్ రెడ్డి| సీపీ సజ్జనార్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


హోలీ అంటే రంగులు, సందడి, మిఠాయిలు… కొంచెం టమాటాలు, కోడిగుడ్లు కూడా ఎగిరిపడితే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కానీ ఈసారి హైదరాబాద్‌లోని దూల్‌పేట్–నాంపల్లి ప్రాంతాల్లో రంగుల హోలీకి అదనంగా “మత్తు రంగు” కూడా జత చేయబడింది. గంజాయితో తయారుచేసిన బంగ్‌తో హుషారుగా తయ్య తక్కలు ఆడుతుండగా ఎస్‌టిఎఫ్ అంజిరెడ్డి బృందం, దూల్పేట్ ఎక్సైజ్ సిబ్బంది కలసి రంగు నీళ్లు చల్లారు!పండుగ హుషారులో “భంగ్ భంగ్” అంటూ సంబరాలు చేసుకుంటున్న వారిపై ఒక్కసారిగా జరగడంతో రంగుల రచ్చ మొదలైంది.

తగ్గేదేలే అనే టైపులో పోలీసులు మొత్తం 2.622 కిలోల గంజాయితో తయారు చేసిన బంగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడు చోట్ల దాడులు చేసి మూడు కేసులు నమోదు చేసి ఆరుగురు మందిని అరెస్ట్ చేశారు. హోలీ హడావుడి నేరుగా ఎక్సైజ్ స్టేషన్ వరకూ చేరింది.హోలీ సందర్భంగా బేగం బజార్‌లో 860 గ్రాముల బంగ్ పట్టుకున్నారు చింతమని చందర్ సింగ్, సోహెల్ సింగ్‌ల “రంగుల వ్యాపారం” అక్కడితో ముగిసింది.

లేకపోతే హౌస్ నంబర్ 15-7-585 వద్ద 812 గ్రాముల బంగ్ స్వాధీనం చేసుకున్నారు. భరత్ రాజ్, నందన్ యాదవ్, మహేష్‌ల హోలీ ప్లాన్‌కు బ్రేక్ పడింది.అలాగేచూడి బజార్ హౌస్ నంబర్ 14-8-155లో 950 గ్రాముల గంజాయి బంగ్ బయటపడింది. సాగర్ శర్మ, అజయ్ శర్మల సంబరం పోలీస్ స్టేషన్‌లో ముగిసింది.పండుగ అంటే పూలు, రంగులు… కానీ కొందరికి మాత్రం “మత్తు రంగులే” అసలు హోలీలా మారింది. రంగులతో ఆడుకోవచ్చు, కానీ చట్టంతో కాదు అంటూ పోలీసులు హెచ్చరించారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird