
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు కవితకు నైతిక విజయం అనడంలో సందేహం లేదు. అయితే కవిత కు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో క్లీన్ చిట్ రావడం బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరంగా పరిణమించింది. ఎందుకంటే ఈ కేసులో గతంలో ఆమె అరెస్టైన సందర్భంగా బీఆర్ఎస్.. పెద్దగా స్పందించలేదు. ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్టు అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అదే సూచన కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. అన్నింటికంటే మించి అరెస్టైన సమయంలో ఆమెను పట్టించుకోని కవిత.. ఆమె నిర్దోషిగా గాయపడినట్లు కోర్టు తీర్పు వెలువడిన తరువాత.. కవిత అరెస్టు తనను రాజకీయంగా చేసి చేసిన వ్యాఖ్యను కవిత నిర్ద్వంద్వంగా ఖండించారు. పార్టీని తనకు అంటగట్టడానికి ప్రయత్నమంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక రెండు నెలల్లో తాను కొత్త రాజకీయపార్టీని ప్రారంభించిన కవిత.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, మహిళలు నిర్లక్ష్యానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఆమె నాయకురాలు కాకుండా ఉద్యమ కారిణిగా ఫోకస్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పక్కన పెట్టిన తెలంగాణ అజెండా ను ఆమె తన భుజానికెత్తుకోనున్నారన్న సంకేతాలనూ ఇచ్చాయి. కవితకు కోర్టు క్లీన్ చిట్ రాజకీయంగా వెయ్యి ఏనుగుల బలవ్వడమే కాకుండా.. ఆదే కేసు కారణంగా తనను దూరం పెట్టి ఒంటరిని చేసిన పార్టీ ఇప్పుడు కక్కలేక మింగలేక అన్న పరిస్థితి ఎదురైంది.

C.E.O
Cell – 9866017966
.webp)
