
ఇరాన్ పై, ఇజ్రాయెల్ భీకరదాదులకు అమెరికా చూస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ముఖ్యంగా ఇరాన్‌లో విద్యనభ్యసిస్తున్న భారత విద్యార్థులు తమను క్షేమంగా భారత్ తీసుకెళ్లాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్రమోడీని కోరుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయాందోళనల్లో క్షణమొక యుగంగా గడుపుతున్నామంటూ వారు చూస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 28) ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఇరాన్‌పై భీకర దాడులు జరుగుతున్నాయి. ఎటు చూసినా బాంబులు, మిస్సైళ్లు, డ్రోన్లు పేలిన శబ్దాలే వినిపిస్తున్నాయి.
ఈ దశలో పరిస్థితి మరింత క్షీణించకముందే.. భారత్ కు వచ్చేయాలని అక్కడి విద్యార్థులు తహతహలాడుతున్నారు. తమను ఎలాగైనా ఇరాన్ నుంచి ఇండియాకు తీసుకెళ్లాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి టెహ్రాన్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో భారీ పేలుళ్ల శబ్దాలు స్పష్టంగా వినిపించాయి.
ఇలా ఉండగా టెహ్రాన్ లో పలు చోట్ల బాంబుదాడులు జరిగాయి. ఇరాన్ ను విడిచి వెళ్లాల్సిందిగా ఇండియన్ అంబసీ గతంలోనే సూచించిన విద్యార్థులకు పరీక్షలు అయిన వెంటనే వెళ్లిపోతామంటూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులను చూసి భయంతో వణికి పోతున్న ఇండియన్ స్టూడెంట్స్.. యుద్ధంగా ఆగినా కూడా ఇక ఇరాన్ లో మాత్రం ఉండబోమని తక్షణమే తమను భారత్ కు తీసుకువెళ్లండంటూ వేడుకుంటున్నారు.

C.E.O
Cell – 9866017966

