
వికారాబాద్ ధారూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య తన స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2020 బ్యాచ్‌కు చెందిన దివ్య హైదరాబాద్ అంబర్ పేట్ లో కానిస్టేబుల్ శిక్షణ పొందింది. గత ఐదేళ్లుగా వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ సహచరుల ప్రశంసలు అందుకుంది.
విధినిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసే దివ్య ఎస్సై కావాలనే లక్ష్యంతో పరీక్షలకు సిద్ధమవు తున్నట్లు సహచరులు తెలిపారు. దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో దివ్య సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే ఆ నోట్లో ఏమి ఉందన్నది తెలియాల్సి ఉంది. దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

C.E.O
Cell – 9866017966
.webp)
