
-నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి విష్ణు విన్యాసం
-పర్వాలేదనే టాక్
-తొలి రోజు కలెక్షన్స్ ఇవేనంట
కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ గా అభిమానులు, సిల్వర్ స్క్రీన్ పిలుచుకుంటున్న ‘శ్రీ విష్ణు'(Sree vishnu)నిన్నవ్వుల ముహూర్తం బాగుందని తన సిద్ధాంతి చెప్పడంతో ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) తో థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. ‘ఆయ్’ బ్యూటీ నయన్ సారిక(Nayan sarika)ఏమో విష్ణు అంటే ఇష్టం ఉండటంతో ప్రాణాలకి తెగించి విష్ణు విన్యాసానికి వంత పాడింది. దీంతో ఆ ఇద్దరు చేసే నవ్వుల హంగామాకి థియేటర్లలో నవ్వుల జడివాన కురుస్తుందని సినీ ట్రేడ్ సర్కిల్స్ రిపోర్ట్. మరి నిన్న విష్ణు విన్యాసం ఏ మేర కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.
తెలుగులో ఈ చిత్రం 2 .36 కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ కలెక్షన్స్ పై మేకర్స్ అధికారకంగా ప్రకటించకపోయినా దాదాపుగా అన్ని సినీ సైట్లలో 2 .36 కోట్ల నే ప్రచురితం అవుతున్నాయి. కాకపోతే ఓవర్ సీస్ కలెక్షన్స్ పై సమాచారం తెలియాల్సి ఉంది. ఇక తెలుగు కలెక్షన్స్ పై సినీ విశ్లేషకులు మంత్ ఎండింగ్ లో కూడా తొలి రోజు దగ్గర దగ్గరగా రెండున్నర కోట్ల రూపాయిలు సాధించడమంటే మాములు విషయం కాదు. మూవీ పర్వాలేదని టాక్ వస్తుండడంతో వీకెండ్ కలిసి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కూడా చదవండి: Ranabaali: ఏందయ్యా సామి,ఇంత కాస్తాందీ వెన్నెల.. రణబాలి నుంచి సాంగ్ రిలీజ్
కథ విషయానికి వస్తే వాస్తు, జాతకాల్నినమ్మే విష్ణు క్యారక్టర్ లో శ్రీవిష్ణు కనిపించాడు. మొదట పెళ్లి చేసుకునే వ్యక్తి చనిపోయి రెండో పెళ్లి తన లైఫ్ లో పర్మినెంట్ గా ఉంటుందనే జాతకాన్ని నమ్మే మనీషా గా నయన్ సారిక కనిపించింది. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు(Yadunaath Maruthi Rao)తెరకెక్కించగా సుమంత్ నాయుడు నిర్మించాడు. 20 కోట్ల బడ్జెట్ అని టాక్.

