
థియేటర్స్ లో ల్యాండ్ అయిన విష్ణు విన్యాసం
శ్రీ విష్ణు మరో హిట్ అందుకున్నాడా!
ప్రేక్షకులు ఏమంటున్నారు
హైలెట్స్ ఏంటి!
లాఫింగ్ థెరపీ ఇవ్వడంలో నో కాంప్రమైజ్. ఒకసారి థియేటర్ కి రండి అంటూ కింగ్ ఆఫ్ టైన్ మెంట్ ‘శ్రీ విష్ణు'(Sree Vishnu)ఈ రోజు ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam)తో థియేటర్ లో అడుగుపెట్టాడు. పైగా ఆయ్ మూవీతో యువత హృదయాల్లో గిలిగింతలు రేపిన ‘నయన్ సారిక'(నయన్ సారిక)హీరోయిన్ కావడంతో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ కి బాగానే పోటెత్తారు. మూవీ చూసిన ప్రేక్షకులు పర్వాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొన్ని హైలెట్స్ గురించి చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
1 .శ్రీ విష్ణు, నయన్ మధ్య ఎంటైర్ మూవీ మొత్తం వచ్చిన సీన్స్
2 . ఆ సీన్స్ లో శ్రీ విష్ణు, నయన్ పెర్ ఫార్మెన్స్
3 .ఎంటర్ టైన్ మెంట్ పార్ట్
4 . డైలాగ్స్
5 .ఓల్డ్ సినిమా సాంగ్స్ కి శ్రీ విష్ణు చేసిన డాన్స్
6 .ఇంటర్వెల్ ఎపిసోడ్
7 .ఫొటోగ్రఫీ
ఇది కూడా చదవండి: విష్ణు విన్యాస్am మూవీ రివ్యూ: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ
పైన చెప్పుకున్న ఆ హైలెట్స్ ఎంతగానో మెస్మరైజ్ అవుతున్నాయి. పాత తరహా కథ అయినా దర్శకుడు యదునాధ్ మారుతీ రావు(Yadunaath Maruthi Rao)బాగానే డీల్ చేసాడు. కానీ సెకండ్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ చూపించాల్సింది..ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. శ్రీ విష్ణు, నయన్ మధ్య తప్ప మిగిలిన వారి నుంచి వచ్చిన సన్నివేశాలు పెద్దగా పేలలేదనే అభిప్రాయాన్ని కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

