

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేటు అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు సంబంధించిన అధికారులతో ప్రణాళికాబద్ధమైన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రబీ 2025-26 వరి ధాన్యాల సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి, ప్రాథమిక సౌకర్యాల కల్పనకై చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. ప్రతి వరి ధాన్యం సేకరణ కేంద్రాల్లో తూనికల సామాగ్రి, టార్పాలిన్లు, సంచులతో పాటు తేమ యంత్రాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. సేకరించిన వారి ధాన్యాన్ని ఆ విధంగా మిల్లులకు తరలించే ఏర్పాటు చేసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, జిల్లా సహకార నాగార్జున అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు ఉన్నారు.

C.E.O
Cell – 9866017966
