జననేత్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జులై15*//: ఆలేరు నియోజకవర్గం,ఆత్మకూర్ (యం) మండలం సింగారం గ్రామంఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,- VHPS జిల్లా కార్యదర్శి లోడి ధనుంజయ్య గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం
ఆత్మకూర్ (యం ) మండలం సింగారంగ్రామంలోవికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS), చేయూత పెన్షన్ దారుల పోరాట సమితి సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం VHPS నాయకులు జామ సుధాకర్ అధ్యక్షతన జరిగింది.
ముఖ్యఅతిథిగా:-MRPSరాష్ట్ర నాయకులు MSP జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, VHPS జిల్లా కార్యదర్శి లోడి ధనుంజయ్య గౌడ్ లు పాల్గొని మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులు వృద్దులు, వితంతువులు, వికలాంగులు,మరియు అన్ని రకాలైన ఆసరా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ
జులై 22 న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో నిర్వహించ తలపెట్టిన పెన్షన్ దారుల జిల్లా సన్నాహక గర్జనకు పెన్షన్ దారులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ లు పెరగడం వికలాంగుల హక్కుల పోరాట సమితి,ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పోరాటాల ఫలితమే అని,వికలాంగులను ఇంటి వాళ్లే భారంగా భావించి దూరం పెట్టిన వారికి భరోసా గా నేను ఉంటా అని మంద కృష్ణ మాదిగ గారు పెన్షన్ పెరగాలని పోరాటం చేసిన గొప్ప నేత అని, పెన్షన్ లను పెంచాలని ప్రభుత్వం ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవాలని మానవతా కోణం లో ఆసరా లేని వారికి అండగా నిలవాలని వారు అన్నారు.
ఆగస్టు13గర్జనవిజయవంతానికి సన్నహాకంగా జులై 22 న యాదాద్రి భువనగిరి జిల్లా లో జరిగే జిల్లా సభ కు వృద్దులు వితంతులు వికలాంగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి మానవతా వాది ఈ మానవీయ పోరాటానికి అండగా నిలవాలని వారు అన్నారు.
నూతనంగా VHPS, వృద్ధుల, వితంతువుల చేయూత పెన్షన్ దారుల పోరాట సమితి నూతన కమిటీలు ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలోMRPS రాష్ట్ర నాయకులు,
MSP జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,
VHPS జిల్లా కార్యదర్శి లోడి ధనుంజయ్య గౌడ్,
VHPS – చేయూత పెన్షన్ దారుల సంఘం నాయకులు
జామ సుధాకర్,MSP నాయకులు మందుల లింగ స్వామి మాదిగ,MRPS గ్రామ శాఖ అధ్యక్షులు మందుల కృష్ణ మాదిగ,బత్తుల స్వామి,కారుపోతుల నర్సింహ్మా,చాట్ల నారాయణ,మందుల రాజయ్య,వాకిటి మల్లా రెడ్డి,మందుల భిక్షపతి,ఎలాకొండ పాండు రెడ్డి,మందుల మల్లయ్య,కొలను చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నల్ల చంద్ర స్వామి మాదిగ,
MRPS రాష్ట్ర నాయకులుMSP జిల్లా అధ్యక్షులు




C.E.O
Cell – 9866017966
