Home Latest News ప్రభుత్వం సీజనల్ వ్యాధులను అరికట్టాలివైద్య సమస్యలను పరిష్కరించాలిప్రైవేటు వైద్య దోపిడిని నివారించాలి

ప్రభుత్వం సీజనల్ వ్యాధులను అరికట్టాలివైద్య సమస్యలను పరిష్కరించాలిప్రైవేటు వైద్య దోపిడిని నివారించాలి

by Jananethram News
0 comments

*ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) జిల్లా ఉపాధ్యక్షులుముసలి సతీష్

    జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై13*//: భద్రాచలం దుమ్ముగూడెం చర్ల ఏజెన్సీ మండలాలలో వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున గోదావరి వరదల కారణంగా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందనీ వెంటనే సీజనల్ వ్యాధులను అరికట్టే చర్యలను ప్రభుత్వం చేపట్టాలనీప్రగతిశీలయువజన సంగం పీ వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు  
ముసలి సతీష్ మాట్లాడుతూ గ్రామాలలో పంచాయితీ పాలకవర్గాలు లేకపోవడం మూలంగా పారిశుద్ధ్య సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తీవ్రంగా సమస్య ఉన్నాయన్నారు. వెంటనే గ్రామాలలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని, బ్లీచింగ్ పౌడర్, చల్లించి దోమల మందు పిచికారి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేకమంది ఆదివాసీలు, గిరిజనులు, అమాయక పేద ప్రజలు విష జ్వరాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. విపరీతంగా దోమలు వ్యాప్తి చెంది రకరకాల జబ్బులు ప్రాణాలు కోల్పోతున్నరని ఆయన్నారు. వెంటనే దోమతెరలను పంపిణీ చేయాలన్నారు. చర్ల మండలంలో  పల్లె దవాఖానాలు మొదలుకొని మండలకేంద్రంలో ఉన్న పీ హెచ్ సీ సెంటర్లు అనేక సమస్యలతో నడుస్తున్నాయన్నారు. చర్ల దుమ్ముగూడెం మండల కేంద్రాలలో 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం మూలంగా ప్రజలు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తున్నారన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో విపరీతమైన బిల్లులు వేసి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ముసలి సతీష్ అన్నారు. వైద్య రంగ సమస్యలు పరిష్కరించే వరకు ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) దశల వారి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విప్లవాభివందనాలతో
ముసలి సతీష్
ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird