జననేత్రం న్యూస్ మంచిర్యాలజిల్లా ప్రతినిధి జులై13*///:మంచిర్యాలజిల్లారామకృష్ణాపురం ఠాగూర్ స్టేడియంలో జూలై 9 నుండి 12 వరకు జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీం నుండి పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లెమడుగుకు చెందిన విద్యార్థులు కే అనిత, టి నవ్యశ్రీ లు రజిత పతకం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి కృష్ణవేణి, పి.డి. బియ్యని కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. టి అనిత గత సంవత్సరం వనపర్తి లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం, హైదరాబాద్ లో జరిగిన సీఎం కప్ లో బంగారు పతకం సాధించిందని వారు. తెలియజేశారు. సిల్వర్ మెడల్ సాధించిన నవ్యశ్రీ, అనితలను మండల విద్యాశాఖ అధికారి శైలజ పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి కృష్ణవేణి ,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు అలివేలు, 59 60 డివిజన్ల కార్పొరేటర్లు లలితా రాణి, నిరంజన్ గ్రామ పెద్దలు కృష్ణమూర్తి, సూర్యం, కృష్ణ, జానీమియా, తాటికొండ శ్రీనివాస్, తిరుపతిరావు, బట్టపోతుల సతీష్, వైకుంఠ చారి పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.




C.E.O
Cell – 9866017966
