జననేత్రం న్యూస్ కడపజిల్లా బ్యూరో జులై12*//:
కడప YSR ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఏపీసీసీ చీఫ్ వై ఎస్ షర్మిలా రెడ్డి గారు COA అధికారులను విజయవాడలో కలవడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో COA అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేశారు. ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదు. వందలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. COA అనుమతులు లేకుండా లైసెన్సులు రావడం లేదు. విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ విద్యార్థుల కష్టాలు నేను ప్రత్యక్షంగా చూశా. ఆనాడు అనుమతులు లేకుండా యూనివర్సిటీ ప్రారంభించడం పెద్ద తప్పు. ఈ తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. రెండేళ్లుగా విద్యార్థులు పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. వెంటనే COA అనుమతులు తీసుకొని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరాం. ఢిల్లీ స్థాయిలో COAను కలుస్తాం అని హెచ్చరించాం. ఒక నెల గడువు ఇచ్చాం. అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ తప్పును సరిద్దుతున్నాం అని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో YSR యూనివర్సిటీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళ్తామని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం.


C.E.O
Cell – 9866017966
