Home Latest News హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అరెస్ట్ క్రికెట్అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అరెస్ట్ క్రికెట్అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

by Jananethram News
0 comments

    *జననేత్రం న్యూస్ హైదరాబాద్ స్టేట్ బ్యూరో జులై09*//:ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ వివాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సీఐడీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌తో పాటు బాడీని అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని ఆరోపిస్తూ.. కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసింది హెచ్‌సీఏ. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్, ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లను హెచ్‌సీఏకు ఫ్రీగా ఇస్తోంది. మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ నివేదికలో బట్టబయలైంది.
ఫ్రీగా 10% టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్‌ఆర్‌హెచ్ తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఒప్పుకుంది. తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు కావాలని జగన్మోహన్7 డిమాండ్ చేశారు. ఇలా 30 శాతం టిక్కెట్లు కావాలంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను జగన్మోహన్ రావు బెదిరించినట్లు తేలింది. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్‌ఆర్‌హెచ్ తేల్చి చెప్పింది. టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా ఇబ్బందులకు గురిచేశారు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేశారు. యాజమాన్యాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు విజిలెన్స్ నివేదికలో నిర్ధారణ అయ్యింది. దీంతో హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది.

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird