*జననేత్రంన్యూస్.ఖమ్మంజిల్లా.బ్యూరో.జూలై08//:ఓటమెరుగని ధీరుడు, ప్రజా సంక్షేమ పథకాల సృష్టి ప్రదాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కొనియాడారు. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మేయర్ పునుకొల్లు నీరజ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎదిగిన వైయస్సార్ విధానం ఆమోగం. ఆయన క్రమశిక్షణ, నిబద్దత, ఉందాతనం నేటి తరానికి ఆదర్శం అన్నారు. 33 ఏళ్లకే పిసిసి ప్రెసిడెంట్ గా ఎదిగిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తాను పోటీ చేసిన ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, మూడుసార్లు మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఓటమి ఎరుగని నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఒక చరిత్రగా, ఇది వైయస్సార్ కు మాత్రమే సాధ్యమైందన్నారు. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఎవరి ప్రోద్బలం, పైరవీలు లేకుండా అర్హులైన వారందరికీ అందేవిధంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యర్రం బాలగంగాధర్ తిలక్, జిల్లా అనుబంధ సంఘ అద్యక్షులు దొబ్బల సౌజన్య, వేజెండ్ల, సాయి కుమార్, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా ఆర్.టి.ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, జిల్లా ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు గజ్జి సూర్యనారాయణ, నగర అనుబంధ సంఘ అద్యక్షులు షేక్ అబ్బాస్ భేగ్, దేవత్ శంకర్ నాయక్, బాణాల లక్ష్మణ్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు నాయక్, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు నాయకులు మిక్కిలినేని నరేంద్ర, కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, జాకీర్ హుస్సేన్, లింగాల రవికుమార్, కమతం రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, జహీర్ భాయ్, రజ్జీ, గడ్డం వెంకటయ్య, తూములూరి లక్ష్మీ నరసింహారావు, పర్వత శ్రీనివాస్, హరినాథ్, శ్రీనివాస్, నల్లపు శ్రీనివాస్, యూసఫ్, రమణ, ఊరుకొండ చంద్రిక, కొత్తపల్లి పుష్ప, చల్లా ప్రతిభారెడ్డి, బలుసు లక్ష్మీ, అన్నపూర్ణ, సుకన్య తదితర నాయకులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
