జననేత్రం న్యూస్ భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి జులై08*//:భద్రాచలం నుండివెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేయిల ఇసుక లారీలు తిరుగుతుంటే రోడ్ల మీద పెద్ద పెద్ద గోతులు పడి నడుముల లోతుల్లో వర్షాపు నీళ్లు నిలబడి వాహనాలు ఎటు పోవాలనేది తెలియక,వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారనీ వాతావరణంను దృష్టిలో పెట్టుకొని లారీలను తీయించాలని ఈరోజు అలుబాక నుండి భద్రాచలం వెళ్లే అంబులెన్సు గంటసేపు ట్రాఫిక్ లో ఇరుక్కొని పేసెంట్ ఇబ్బంది పడ్డారని *సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు* ఈ సందర్బంగా ముసలి సతీష్ మాట్లాడుతూ లక్షల లారీలు 24గంటలు రోడ్ల మీద తిరుగుతున్న కారణంగా గత రెండు నెలలుగా చర్ల మండలం నుండి వెంకటాపురం మండలం వరకు బస్సులు బంద్ ప్రజలు ఆటోలల్లో మ్యాజిక్ లల్లో అలుబాక నుండి వెంకటాపురం వరకు 20,కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 200రూపాయలు చర్ల నుండి అలుబాక వరకు ప్రయాణం చేస్తే 200,రూపాయలు ఎందుకంటే మధ్యలో ఏకన్నగూడెం బిర్జి కుంగిపోయింది బిర్జి పక్కన క్రింద నుండి రేజింగ్ కాంట్రాక్టర్లు మట్టి రోడ్డు పోసి లక్షల ఇసుక లారీలను నడుపుతున్నారు ఈ రోడ్లు రేజింగ్ కాంట్రాక్టర్ల బాబులయా అని ముసలి సతీష్ అన్నారు తక్షణమే రోడ్లు పోపించి కుంగిపోయిన బిర్జిలను కులగొట్టి ఐ లెవల్ బిర్జిలు కట్టించకుంటే సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బంధుకు పిలుపునిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎన్నిసార్లు ఆందోళనలు చేసిన విజిలెన్స్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన భద్రాచలం MLA కు కలెక్టర్లకు ఆర్ అండ్ బి అధికారులుకు RTO RDO,మండల అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసిన చెవుటొడు ముందు శంఖం,
ఊదిన సామెతగా వ్యవహరిస్తున్నారనీ ప్రజలు ప్రాణాలు పోయినా పరవాలేదు అన్నట్లుగా అధికారులు ప్రభుత్వం వ్యవహరింస్తుందని ముసలి సతీష్ అన్నారు తక్షణమే వేయిల ఇసుక లారీలను చర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో లేకుండా చెయ్యాలని రేజింగ్ కాంట్రాక్టర్ల సభ్యత్వం ఇసుక ర్యాంపుల పర్మిషన్ లు రద్దు చెయ్యాలని 100ల కోట్లకు DDలు కట్టుతు రోడ్డుకు ఇరువైపులా లక్షల లారీలను నిలుపుతుంటే విద్యార్థులు బడులకు పోయి వస్తారో రారో అని విద్యార్థుల తల్లితండ్రులు గందరగోళంలో పడుతున్నరని మరోపక్కనొప్పులతో బాధ పడుతున్న గర్భిణీ మహిళను రోగులను అంబులెన్సులో హాస్పిటల్ కు తీసుకోని వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ లో గంటలు గంటలు ఇరుక్కు పోయి ప్రాణాలు పోతున్న పరిస్థితి చర్ల మండలంలో చూస్తున్నాము గత 19,నెలలగా చర్ల వెంకటాపురం మండలాలో 50పైగా ఇసుక ర్యాంపులకు పర్మిషన్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వేయిల కోట్లరూపాయలు ఇసుక బిజినెస్ చేస్తుందనీ ఈ భద్రాచలం గోదావరి ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తున్నారనీ వారు అన్నారు తక్షణమే భద్రాచలం నుండి వెంకటాపురం వరకు ఇవే రోడ్డు పోయాలనీ
సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తున్నారు,
ఇదే రకంగా రోడ్లుని పట్టించుకోకుండా ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తే పెద్ద ఎత్తున దిగ్బంధనం చేస్తామని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలనీ లేని పక్షంలో సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా రాస్తారోకో పెద్ద ఎత్తున చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు,
ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకు పోయినా కూడా ఏమాత్రం చలనం లేకుండా అధికారులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరింస్తున్నారని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం


C.E.O
Cell – 9866017966
