జననేత్రంన్యూస్ హన్మకొండ ప్రతినిధి జూలై07*//: వరంగల్ ఎన్ఐటి కి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, టీజీఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలను అందించి ఘనంగా స్వాగతం పలికారు.
సోమవారం కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్స్ లర్ జిష్ణు దేవ్ వర్మ వరంగల్ ఎన్ఐటీకి చేరుకోగా ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు స్వాగతం పలికిన వారిలో వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ బిద్యాధర్ సూబుది, వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈవీ. శ్రీనివాస్ రావు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు ఉన్నారు.


C.E.O
Cell – 9866017966
