*సిఐటియు టౌన్ కన్వీనర్ బండారు శరత్ బాబు
*జననేత్రంన్యూస్.భద్రాచలంప్రతినిది.జూలై06*//:భద్రాచలం జూలై 6, కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకు వస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు కోరారు. సిఐటియు పట్టణ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి వైవి రామారావు అధ్యక్షత వహించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానానికి బదులు 10 గంటల పని విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకు వచ్చిందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందని ఇటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆయన కోరారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వి నర్సారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే జూలై 9 దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోసం విస్తృతమైనటువంటి కార్యక్రమాలు ప్రచారం జరుగుతోందని జులై 9 వ తారీకు జరిగే ర్యాలీని ఉద్యోగులు కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గడ్డం స్వామి, సిఐటియు నాయకులు పారేల్లి సంతోష్ కుమార్, కొలగాని రమేష్, నకరికంటి నాగరాజు, ఎస్ అజయ్ కుమార్ అప్పారి రాము, గుమ్మడి నాగరాజు, ఎస్ భూపేందర్, తదితరులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
