Home Latest News కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్-మతోన్మాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా

కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్-మతోన్మాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా

by Jananethram News
0 comments

*జూలై 9 న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – తమ్మినేని.
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూలై04 2025జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన ప్రజాసంఘాల సమావేశం సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ మోడీ పాలనలో గత 10 ఏళ్ళుగా స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తల ఆర్థిక ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్లను తెచ్చారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పొడిగించేందుకు, పని భారం పెంచేందుకు శ్రీకారం చుట్టారని యూనియన్లు పెట్టుకునే హక్కును నిరాకరిస్తున్నారని కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలివ్వాలన్న చట్టబద్ధ ఆదేశాలను, న్యాయస్థానాల తీర్పులను బుట్టదాఖలు చేస్తున్నారని వారు విమర్శించారు. కార్మిక సంక్షేమం, సాంఘిక భద్రత, ఉపాధి, ఉద్యోగ రక్షణ లేకుండా పోతున్నాయి. దేశంలో నయా ఉదారవాద విధానాలు, సంస్కరణల అమలు వల్ల ఆర్థిక అసమానతలు తీవ్రమౌతున్నాయి. ఆర్ధిక మాంద్యం మరింత ఉధృతం అవుతుంది. ఉపాధి కల్పన స్థంబించి నిరుద్యోగం పెరిగింది. సంపద కొద్దిమంది సంపన్నుల వద్ద పోగుపడుతుంది. సంపద 40 శాతానికి పైగా 1శాతం సంపన్నుల వశం అవుతుంది. ఒక్క సంవత్సరంలోనే శతకోటీశ్వరుల సంఖ్య 102 మంది నుండి 166 మందికి పెరిగిందని వారు పేర్కోన్నారు. దీనికి భిన్నంగా 23 కోట్ల మంది ప్రజలు ఆకలి,దారిద్య్రంలోకి దిగజారారు. కార్మికవర్గంతో పాటు రైతు – వ్యవసాయ కార్మికులు, సామాన్య ప్రజలు సైతం దోపిడీకి గురౌతున్నారు. దీంతోపాటు పాలక వర్గాలు కులం, మతం, ప్రాంతం, లింగం, జాతి, భాష తదితర భావోద్వేగాలను ఉపయోగించుకుంటూ కార్మిక వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ ఆర్థిక ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనం కూడా పొందుతున్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయంతో పాటు ఆ సంస్థల మిగులు భూములను అమ్మడానికి బరితెగించింది. ఉద్యోగుల భవిష్యనిధి (పి.ఎఫ్) పై వడ్డీ తగ్గించాలనే ప్రతిపాదనలు చేసింది. పి.ఎఫ్ నిధులతో సహాఇన్సూరెన్స్, బ్యాంకింగ్ లలో వాటాలను షేర్ మార్కెట్లో పెట్టి ఆదానీ లాంటి కార్పొరేట్స్కు లబ్ధిచేకూరేలా నిర్ణయించింది. విలువైన జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, రైళ్ళు, స్టేషన్లు, గ్యాస్ పైపైన్లు తన అనుయాయులకు కట్టబెడుతూ దేశ సంపదను లూఠీ చేస్తున్నది.మోడీ ప్రభుత్వ కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాల వల్ల కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని దేశ రైతాంగం ఏడాదికి పైగా చేసిన సమరశీల పోరాట ధాటికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంవత్సరం దాటింది. అయినా దొడ్డి దారిన అవే విధానాలను ఏకపక్షంగా అమలు చేస్తున్నది. విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నది. దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ మోడీ సర్కారుకు పట్టడం లేదు. పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీవ్ర సమస్యలుగా దేశ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. దేశంలో బిజెపి పాలన అధ్వాన్నంగా తయారైంది. ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్ట మంటగలిసిపోతున్నా స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నదని ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోన్నం వెంకటేశ్వరావు ఐద్వారాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ బొంతు రాంబాబు సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు రమణ బండి పద్మ వ్వసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగుసత్యనారాయణ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్. బషీరుద్దీన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీ. ప్రవీణ్, పి. సుధాకర్ తుమ్మ విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు

.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird