*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూలై01*//: ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షు డు జి. రవీందర్ నాయక్ లంబాడీలు తమ హక్కుల సాధనకు
సంఘటిత ఉద్యమాలు తలపెట్టాలని లంబాడి హక్కుల పోరాట సమితి _ నంగారా బేరి ( ఎల్ హెచ్ పి ఎస్ ) జిల్లా అధ్యక్షుడు గూగు లోతు రవీందర్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గత 28 సంవత్సరాల నుండి లంబాడీల హక్కులు, అభివృద్ధి కోసం ఎల్ హెచ్ పి ఎస్ పోరాడుతుందని తెలిపారు. నేడు తమ సంఘం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందని ఈ నేపథ్యంలో లంబాడీలు సంఘటిత ఉద్యమాల ద్వారా తమ అభివృద్ధి సాధించగలరని వివరించారు. ఈ సందర్భంగా లంబాడీలంతా పార్టీలు రాజకీయాలకతీతంగా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం రాష్ట్రంలోని పాలకులు లంబాడీల గోరుబోలి భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని , అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని , ఎస్టీ రిజర్వేషన్ ను 10 శాతం వరకు పెంచాలని , తండాల అభివృద్ధి నిమిత్తం బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


C.E.O
Cell – 9866017966
