జననేత్రం న్యూస్ రఘునాధపాలెం మండల ప్రతినిధి జూన్26*//:రఘునాధపాలెం మండల పరిధిలోని పుటానితండాగ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుకు రఘునాథపాలెం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం సిపిఎం పార్టీ మండల నాయకులు చేతుల మీదుగా వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రంలో గ్రామంలో అంగన్వాడి కేంద్రానికి తక్షణమే భవనం ఏర్పాటు చేయవలసిందిగా, మరియు గ్రామంలో ప్రస్తుతం రేషన్ మినీ దుకాణాన్ని ఏర్పాటు చేశారని, దానిని రెగ్యులర్ చేసి, ప్రత్యేక రేషన్ షాపును ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు సౌకర్యం కల్పించాలని కోరారు. వ్యవసాయ భూములకు వెళ్లే డొంక రోడ్లు వర్షాకాలంలో బురదమయంగా మారి రైతులు వ్యవసాయ భూములకు పనులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరారు. గ్రామపంచాయతీలో ప్రస్తుతం తడి పొడి చెత్త సేకరణ చేపట్టడం లేదని, చేపట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో ఉన్న నిరుపేదలు ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, తెలియజేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని, వాటికి అవసరమయ్యే బిందు సేద్యం, మరియు మల్చింగ్ సబ్సిడీ రూపంలో ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా అందించాలని వారు తెలియజేశారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ముక్కుడి కుంట చెరువుకు సాగర్ జలాలతో నింపి, రైతులకు రెండు పంటలు పండించే విధంగా రైతులకు సౌకర్యం చేయాలని మంత్రికి వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి, గుగులోతు హరి, ఆకారపు కృష్ణ, ఆకారపు వీరయ్య, సక్కుబాయి, షీలా, తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
