*ఈ ప్రపంచంలో విద్య ఒక్కటే శక్తివంతమైన ఆయుధం
*జననేత్రం న్యూస్ కృష్ణాజిల్లా బ్యూరో జూన్25*//: జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నేటి యువత క్షణికమైన మత్తు కోసం విషపూరితమైన మత్తు మాదకద్రవ్యాల వినియోగం కారణంగా జరిగే నష్టాలు కుటుంబపరంగా, సమాజపరంగా ఎదుర్కొనే దుష్పరిణామాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు.
*ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు పలు అంశాలు పై చర్చించారు*
ట్రాఫిక్ రూల్స్ సైబర్ క్రైమ్ (1930) పోక్సో యాక్ట్ , గుడ్ టచ్ మరియు బాడ్ టచ్ విషయాలపై క్లుప్తంగా వివరించారు.
మత్తు మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని అవి అలవాటు చేసుకున్న వారి జీవితాలు నాశనం అయ్యాయి. మత్తుకి అలవాటు పడితే మెదడు పని చేయడం మనేస్తుందని విద్యార్థులు వాటిపై అవగాహన చేసుకొని మరికొందరికి తెలియజేయడం ద్వారా నిర్ములన సులువు అవుతుంది. మీరు నిర్ములనలో భాగస్వాములు అయి బాధ్యత గల పౌరులు అవుతారు.
ఇంటి దగ్గర నుండి బయలుదేరి స్కూల్ కి వచ్చే మార్గంలో అనేకమైన వాహనాల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మార్గానికి ఎడమవైపు రావాలని.. మీరే కాకుండా మీతో మీ కుటుంబ సభ్యులకు కూడా హెల్మెట్ ధరించేలా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని సూచించారు.
సామాజిక మాధ్యమాల వినియోగించే సమయంలో వాటికి సంబంధించిన సమాచారం గానీ, వ్యక్తిగత వివరాలు గానీ ఎవరికి షేర్ చేయకూడదని, వివరాలన్నీ గోప్యంగా ఉంచుకోవాలని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు మీ యొక్క అకౌంట్లో డబ్బు వ్యక్తిగత విషయాలు దోచుకునేందుకు అనేకమైన మార్గాలలో తమను చేరుకుంటారని *వ్యక్తిగత సమాచారాన్ని OTP PASSWORD తెలియని ఫోన్ నెంబర్ నుంచి వచ్చే LINKS ఓపెన్ చేయకూడదు మరియు Files వంటివి ఓపెన్ చేయకూడదు మరియు ఎవరికీ పంచుకోకూడదని గోప్యంగా ఉంచుకోవాలని తెలిపారు.
POCSO చట్టం గురించి మరియు Good touch and Bad touch గురించి అవగాహన కల్పించినారు.
పాఠశాల నుండి అన్ని విషయాల మీద అవగాహన చేసుకొని చురుకుగా ఉండాలి. ఇప్పటి నుండి చదువు మీద మక్కువ, కష్టపడితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని సూచించారు. విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు.

