జననేత్రం న్యూస్ దౌల్తాబాద్ మండల ప్రతినిధి జూన్26//: గొల్లపల్లి: దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా సరిగ్గా వర్షాలు పడక రైతులు ఆవేదన గురవుతున్నారు. విత్తనాలు వేసిన తర్వాత వానదేవుడు కరుణించకపోవడంతో, రైతులు ఇబ్బంది పడుతున్నారు. వేసిన విత్తనాలు పత్తి మొక్కజొన్న, వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో, రైతులు గోడు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఒక ఎకరానికి 15 వేల పెట్టుబడి పెట్టి విత్తనాలు నాటితే ఫలితం లేకుండా పోయాయి. మళ్లీ వర్షాలు సరైన టైంలో పడకపోవడంతో, రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. మళ్లీ రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి దగ్గర అప్పు తీసుకొని మళ్లీ విత్తనాలు వేసే పరిస్థితి వచ్చింది. రైతులు తమ కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. రైతు చేసేదేమి లేక మళ్లీ విత్తనాలు వేయడానికి అప్పు చేయవలసిన అవసరం వచ్చింది. ఇప్పటికే చేసిన అప్పు చేసి విత్తనాలు వేస్తే ఫలితం లేదు, అప్పుచేసి మళ్లీ విత్తనాలు వేయడానికి రైతులు ఎదురుచూస్తున్నారు. రైతే రాజు అన్న పదం తప్ప రైతుకు మిగిలింది ఏమీ లేదు, రైతుకు పండించడమే తెలుసుగాని మరొకటి తెలియదు రెండవ దశ విత్తనాలు వేయడానికి రైతన్నలు అప్పుల పాలవుతున్నారు. చేసేదేం లేక వర్షం పడగానే పంట వేయడానికి రైతన్నలు సిద్ధమయ్యారు.


C.E.O
Cell – 9866017966
