*జననేత్రం న్యూస్ మహబూబాబాద్ జిల్లా బ్యూరో జూన్.23*//:ప్రజలు గ్రీవిన్స్ లో పలు సమస్యలపై చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా… గూడూరు మండలం ఎపూరు గ్రామంలోని రేకులతండ కు చెందిన భానోత్ మోతిరాం గత 50 సంవత్సరాల నుండి సర్వే నెం.664/2 లో గల రెండున్నర ఎకరాల భూమిని తన పేరు మీద పట్టా చేసి ఇవ్వాలని కోరారు.
మహబూబాబాద్ పట్టణంలోని కె.జి.బి.వి లో ఎస్.కె. షహీన్,పి.నాగమణి హెడ్ కుక్ అసిస్టెంట్ గా తాము కొంత కాలం పనిచేశామని అట్టి కాలానికి జీతం ఇంతవరకు ఇవ్వలేదని, అట్టి కాలానికి నా జీతాన్ని ఇప్పించగలరని కోరారు.
గార్ల మండలం సీతంపేట గ్రామానికి చెందిన బానోత్ కృష్ణ చైతన్య తను నిరుద్యోగినని, తన బ్రతుకు దెరువుకు ఆధారంగా ఏదైనా ఉపాది కల్పించాలని కోరారు.
మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన వంగూరి శ్రావంతి తను తన భర్త నుండి విడాకులు పొంది ఒంటరిగా పాపతో జీవిస్తున్నాని, పాపను పోషించుకోవడానికి బ్రతుకు దేరువుగా ఏదేని ఒక కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇప్పించగలరని కోరారు.
మరిపెడ మండలం నీలకుర్తి గ్రామం రేఖ్యా తండాకు చెందిన బానోత్ బాలు తనకు ఉన్న భూమి సర్వే నెంబర్ కొత్త పాస్ బుక్ లో ప్రభుత్వ భూమి అని పడిందని, అదే సర్వే నెంబర్ తో పాత పాస్ బుక్ లో పట్టా భూమి అని ఉండెనని, నాకు నా తల్లి తండ్రుల నుండి సంక్రమించిన వారసత్వ భూమి తన తమ్ముడి పాస్ బుక్ లో పట్టా భూమి అని తన పాస్ బుక్ లో ప్రభుత్వ భూమిగా పడిందని నా సమస్య పరిష్కరించి సరిచేసి న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్బంగా వివిధ శాఖలకు సంబందించి వచ్చిన ( 106 ) దరఖాస్తులను సబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారం కొరకు ఆదేశించారు.
ఈ ప్రజావాణిలో జెడ్.పి సీ ఈఓ పురుషోత్తం, డి.ఆర్.డి.ఓ మధుసూధనరాజు, హౌసింగ్ డి.ఈ రాజయ్య, ఏ.డి.సర్వే ల్యాoడ్ నరసింహ మూర్తి, డి.ఎం.ఇండస్ట్రీ శ్రీమన్నారాయణ, బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ డెవలప్మెంట్ అధికారులు నరసింహస్వామి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, డి.పి.ఓ హరిప్రసాద్,డి.హెచ్.ఓ మరియన్న, డి.సి.ఓ వెంకటేశ్వర్లు, ఎల్.డి.ఎం.సత్యన్నారాయణ మూర్తి, పెన్షన్ అధికారి శంకర్, కలెక్టరేట్ ఏ.ఓ పవన్ కుమార్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, భూభారతి కోఆర్డినేటర్ సురేష్, మండలాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
