జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్ 22*//:ఖమ్మం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద జరిగిన సమావేశంలో కొత్త బస్టాండ్ మరియు పాత బస్టాండ్ ఆటో అడ్డ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు పేర బోయిన మోహన్ రావు , పాల్వంచ కృష్ణ , దేవత్ చిన్ని , రావుల శ్రీనివాసరావు పాల్గొని నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు . పాత బస్టాండ్ అడ్డా ప్రెసిడెంట్ గా కొమ్ము ఉపేందర్ , కొత్త బస్టాండ్ అడ్డా ప్రెసిడెంట్ గా జీడి శ్రీనివాస్ , ఉపాధ్యక్షులుగా ఎండీ ఖాన్ , ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్ , కోశాధికారిగా కొమ్ము గిరిరాజు , కమిటీ సభ్యులుగా మల్సూర్ ఖాన్ , రాజేశ్వరరావు , ఎస్.కె కాసిం , దుస్సా శ్రీను , ఉపేందర్ , తాజుద్దీన్ ఎన్నుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు షకీల్ , సొందు , ఎస్.కె సలీం , వల్లభి మోహన్ రావు , నబి మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు .


C.E.O
Cell – 9866017966
