*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్21*//: గ్రేస్ సర్వీస్ సోసైటీ నిర్మించిన నూతన గ్రేస్ స్కూల్ భవనం ప్రారంబోత్సవ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హాజరైనారు. ఈ సందర్భంగా యంపి మాట్లాడుతూ… స్కూలు స్థాయి నుండి కాలేజి, నర్సింగ్ 8 కాలేజి వరకు నిర్వహిస్తున్న గ్రేస్ సోసైటీ సేవలను వారు కొనియాడారు. విద్యార్ధులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్థానిక శాసన సభ్యులు రాందాస్ నాయక్ మాట్లాడుతూ… గ్రేస్ సర్వీస్ సోసైటీ అనాధ లకు, నిరుపేదలకు, మున్నేరు ముంపు సమయంలో బియ్యం, నిత్యావసర వస్తువుల సరఫరా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బుక్స్, బ్యాగులు, దుప్పట్లు పంపిణీ చేసి సేవా కార్యమ్రాలకు జిల్లాలో పేరుగాంచిందని, ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం ఇలాగే కొనసాగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మండల కాంగ్రేస్ అద్యక్షులు వడ్డే నారాయణ రావు, ఆత్మకమిటీ చైర్మన్ కోసూరి శ్రీను, జిల్లా నాయకులు సూరంపల్లి రామారావు, గోసు మధుతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి జి.యస్.యస్ వ్వవస్థాపకులు మారినేని జాకబ్ అద్యక్షత వహించగా, వారి సతీమణి ఎలిజిబెత్, సిఈఓ శ్యామ్ జోసెఫ్, ఈ స్టరన్ పాల్, స్టీఫెన్ రెడ్డి, వెంకటేశ్వర రాజు, కళాశాల ప్రిన్సిపాల్ బి. క్రిష్ణయ్య స్కూల్ ప్రిన్సిపాల్ వై.వేణు డైరెక్టర్ అజయ్ కుమార్, హాస్టల్ ఇంచార్జ్ ఎ.పుల్లారావు, విద్యార్ధులు అధ్యాపక బృందం పాల్గోన్నారు.



C.E.O
Cell – 9866017966
