*ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో దళిత సమస్యలపై వినతిపత్రం అందజేత. *జననేత్రంన్యూస్ యాదాద్రిభువనగిరి జిల్లా బ్యూరో జూన్21*//: కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం కు సమీక్ష సమావేశానికి విచ్చేసిన
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కి ఎంఎస్పీ ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని దళిత సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ ఈ క్రింది అంశాలపై వినతి పత్రం అందజేయడం జరిగింది అని తెలిపారు
1) తొలివిడత దళిత బంధు పథకం క్రింద యాదాద్రి భువనగిరి జిల్లా లో లబ్ది పొందిన దళిత బంధు లబ్ది దారులలో పూర్తి అమౌంట్ వేయకుండా ఉన్న పెండింగ్ మొత్తాల నిధులను విడుదల చేయాలి
2) జిల్లా లో అన్ని గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలనుండి ప్రభుత్వ భూములు సేద్యం చేసుకుంటూ భూములపై ఖాబ్జా లో ఉన్న నిరుపేద దళితులకు ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి
3)యాదాద్రి (యాదగిరిగుట్ట లో 314 సర్వే నంబర్ లో సుమారు 10 సంవత్సరాలనుండి ఖబ్జా లో ఉన్న ప్రభుత్వ భూమికి అంబేద్కర్ భవన్ పేరిట పట్టా ఇవ్వాలి. అంబేద్కర్ భవన్ కు నిధులు కేటాయించాలి.
4) ప్రతి నెల వివిధ మండలాల్లో ని ఏదేని ఒక గ్రామంలో నిర్వహిస్తున్న సివిల్ రైట్స్ డే ను నామమాత్రంగా నిర్వహించకుండా సంబంధిత అధికారులు షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో పర్యటించి అందరు అధికారులు హాజరై ప్రజలకు హక్కులపై అవగాహణ కల్పించాలి.
పై అంశాలపై వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు.ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమం లో
ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు
నల్ల చంద్ర స్వామి మాదిగ,
ఎమ్మార్పియస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ,
ఎమ్మార్పియస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు దుబ్బ దానయ్య మాదిగ
ఎమ్మార్పియస్ ఎంఎస్పీ జిల్లా నాయకులు బండారి శివశంకర్ మాదిగ
అకారపు లక్ష్మీనారాయణ మాదిగ,
గంధమల్ల భిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
